ఎయిర్ పోర్ట్ లో భార్యకు వంద రూపాయలు ఇచ్చి షాపింగ్ చేసుకోమన్న డాక్టర్ బాబు.. చివరికి ఏం జరిగిందంటే?

డాక్టర్ బాబు అనగానే వెంటనే మనకు గుర్తుకొచ్చే సీరియల్ కార్తీకదీపం.ఎందుకంటే ఈ సీరియల్ లో డాక్టర్ బాబు పాత్ర ప్రేక్షకులను అలా ఆకట్టుకుంది కాబట్టి.

ఇందులో డాక్టర్ బాబు పాత్రలో నిరూపమ్ పరిటాల నటిస్తున్నాడు.ఇక ఈయనకు భార్య పాత్రలో వంటలక్క అలియాస్ ప్రేమి విశ్వనాథ్ నటిస్తున్న సంగతి తెలిసిందే.

ఇక ఈ సీరియల్ ఇప్పటికీ ప్రేక్షకులను అసలు వదలట్లేదు అని చెప్పవచ్చు.ఇక ప్రేమివిశ్వనాధ్, నిరూపమ్ పరిటాలకు మంచి అభిమానం ఉంది.

ఇక వీరిద్దరి సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటారు.అయితే తాజాగా డాక్టర్ బాబు తన రియల్ లైఫ్ భార్యకు ఎయిర్పోర్టులో చుక్కలు చూపించాడు.

ఇంతకు అసలు ఏం జరిగిందో తెలుసుకుందాం.నిరుపమ్ పరిటాలకు తెలుగు బుల్లితెరపై మంచి అభిమానం ఉంది.

ఎన్నో సీరియల్స్ లో నటించిన నిరూపమ్ కు కార్తీకదీపం సీరియల్ ద్వారా మంచి అభిమానం ఏర్పడింది.

పైగా ఈ సీరియల్ తోనే ఆయనకు మరింత క్రేజ్ కూడా వచ్చింది.వెండితెరపై చిన్న చిన్న పాత్రలతో కనిపించాడు నిరూపమ్.

కానీ ఆయనకు మాత్రం బుల్లితెరనే కలిసి వచ్చింది.ఇక ఈయన భార్య మంజుల కూడా సీరియల్ నటి అన్న సంగతి అందరికీ తెలిసిందే.

ఆమెకు కూడా బుల్లితెరపై మంచి పేరు ఉంది.ఈమె కూడా చాలా సీరియల్స్ లలో నటించి మంచి పేరు సంపాదించుకుంది.

వీరిద్దరు పెళ్లికి ముందు ఓ సీరియల్లో నటించగా ఆ సమయంలో వీరి మధ్య పరిచయం పెరిగి లవ్ లో పడ్డారు.

ఆ తర్వాత అందరి ముందు ఘనంగా పెళ్లి చేసుకున్నారు.వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు.

ఇక మొన్నటి వరకు మంజుల సీరియల్స్ కి బ్రేక్ ఇవ్వగా.మళ్లీ రీ ఎంట్రీ ఇచ్చింది.

ఈ భార్యాభర్తలు సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటారు.ఇక వీరికి యూట్యూబ్ లో ఒక ఛానల్ కూడా ఉంది.

"""/"/ అందులో వీరు పంచుకునే వీడియోలు మాత్రం బాగా హైలైట్ అవుతూ ఉంటాయి.

మంచి మంచి కంటెంట్ తో వీళ్ళు వీడియోస్ తీస్తూ జనాలను మరింత ఆకట్టుకుంటారు.

అయితే తాజాగా మంజుల మరో వీడియో షేర్ చేసుకుంది.అందులో వీళ్లు కలిసి ఓ పెళ్లికి వెళ్తున్నారు.

ఈ విషయాన్ని మంజుల తెలిపింది.ఇక ఎయిర్ పోర్ట్ దగ్గరికి వెళ్లగా అక్కడున్న షాపింగ్ మాల్స్ చూసి మంజుల పదేపదే నిరూపమ్ వెంట ఇప్పించమంటూ తగిలింది.

ఎప్పుడు అదే పనా అంటూ నిరూపమ్ బాగా కౌంటర్లు వేశాడు.అయినా కూడా మంజుల అవన్నీ చూసి ఫిదా కావడంతో ఎలాగైనా బలవంతం పెట్టింది.

దాంతో నిరూపమ్ తనకు ఒక టాస్క్ ఇచ్చాడు.అది కూడా 100 రూపాయలు ఇచ్చి ఎయిర్ పోర్ట్ లో ఉన్న షాపింగ్ మాల్స్ లో ఎన్ని వస్తువులు కొంటే అన్ని నీకు ఇప్పిస్తాను అని టాస్క్ ఇచ్చాడు.

దాంతో మంజుల 100 రూపాయలకు ఏమీ రాదు అంటున్న కూడా నిరూపం మాత్రం ఎలాగైనా కొనాలి లేదంటే ఏమి ఇప్పివ్వను అని అన్నాడు.

"""/"/ దాంతో మంజుల ఎయిర్పోర్టులో ఉన్న షాపింగ్ మాల్స్ మొత్తం తిరిగింది.ఎక్కడ దొరకకపోయేసరికి పైగా ఫ్లైట్ టైం కూడా దగ్గర పడేసరికి నిరుపం మాత్రం తనను చూసి బాగా ఎంజాయ్ చేశాడు.

ఇలాంటివి అప్పుడప్పుడు చేయాలి అని అప్పుడే మన జేబులు ఖాళీగా కాకుండా ఉంటాయి అని అన్నాడు.

ఆ తర్వాత మంజుల మెడికల్ షాప్ దగ్గరికి వెళ్లి ఒక రెండు వస్తువులు కొని మొత్తానికి నిరూపమ్ కి చూపించింది.

కానీ అప్పటికే ఫ్లైట్ టైం అవ్వడంతో బతికి పోయాను అనుకున్నాడు నిరూపమ్.మొత్తానికి షాపింగ్ చేయకుండా చేశాను అని మురిసిపోయాడు.

ఇక మంజుల మాత్రం ఇప్పుడు కాకున్నా తర్వాతకు అస్సలు వదలను అని వీడియో ముగించింది.

ఈ వీడియో చూసిన తమ అభిమానులు మాత్రం.డాక్టర్ బాబు భలే టాస్క్ ఇచ్చాడు అంటూ తెగ మెచ్చుకుంటున్నారు.

కూలిపోవడానికి రెడీగా ఉన్న ఇల్లు.. అన్ని కోట్లకు కొనుగోలు చేసిన ఇంటీరియర్ డిజైనర్..