భార్యకు ఏడువారల నగలు కొనిచ్చిన డాక్టర్ బాబు.. మీ ఆడాళ్ళకు అదే పిచ్చి అంటూ కామెంట్?

బుల్లితెరపై మంచి ప్రేక్షకదారణతో ప్రసారమవుతున్నసీరియల్ కార్తీకదీపం.అతి తక్కువ సమయంలో మంచి గుర్తింపు సొంతం చేసుకొని.

ప్రేక్షకులకు అభిమాన సీరియల్ గా మారింది.సెలబ్రెటీలు సైతం ఈ సీరియల్ కు ఎంతలా వాలిపోయారో చూసాం.

ఇందులో నటించే కార్తీక్, దీప, సౌందర్య, మోనిత పాత్రలకు బాగా ఆకర్షితులయ్యారు.ఇక వీరి గురించి ఏ వార్త వచ్చిన వైరల్ గా మారుతుంది.

ముఖ్యంగా డాక్టర్ బాబు గురించి మాత్రం ఏ విషయం వచ్చిన సరే వెంటనే వైరల్ అవుతుంది.

ఈ సీరియల్ తో డాక్టర్ బాబుగా ఎంతో మంది అభిమానులను సంపాదించుకున్నాడు నిరుపమ్ పరిటాల.

అంతేకాకుండా బుల్లితెర స్టార్ హీరోగా గుర్తింపు పొందాడు.పలు బుల్లితెర ధారావాహిక లో నటించిన ఈయన కార్తీకదీపం తోనే మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు.

ఇక ఈయన మరో బుల్లితెర నటి మంజులను పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.

మంజుల కూడా బుల్లి తెర పై పలు సీరియల్స్ లో నటించి మంచి గుర్తింపు సొంతం చేసుకొని అభిమానాన్ని సంపాదించుకుంది.

వీరికి ఒక బాబు కూడా ఉన్నాడు. """/" / గత కొంత కాలం సీరియల్స్ కు దూరంగా ఉన్న మంజుల ఇప్పుడు మళ్లీ రీ ఎంట్రీ తో ఓ సీరియల్ లో నటిస్తుంది.

ఇక డాక్టర్ బాబు మాత్రం హిట్లర్ గారి పెళ్ళాం అనే మరో సీరియల్ లో కూడా నటించిన సంగతి తెలిసిందే.

ఈ సీరియల్ కూడా నిరూపమ్ కు మంచి గుర్తింపు అందిస్తుంది.నిరూపమ్ కు వెండితెరపై కూడా పలు సినిమాలలో అవకాశాలు అందుకోగా వదులుకున్నాడు.

"""/" / ఇదిలా ఉంటే ఈయన పాత్ర కార్తీకదీపం లో ముగిసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం సీరియల్స్ కు దూరంగా బాగా ఎంజాయ్ చేస్తున్నాడు.సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు.

తనకు సంబంధించిన వ్యక్తిగత విషయాలను, ప్రాజెక్టు సంబంధించిన విషయాలను బాగా షేర్ చేసుకుంటాడు.

తన ఫ్యామిలీతో బాగా ట్రిప్స్ అంటూ ఎంజాయ్ చేస్తాడు.ఇక ఈయన యూట్యూబ్ లో తన పేరుమీద ఛానల్ కూడా క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే.

అందులో ఇప్పటికీ చాలా వీడియోలు పంచుకోగా.చాలా వరకు ఆ వీడియోలు బాగా పంచ్ కామెడీ లతో ఉంటుంది.

ఇక తన భార్య మంజుల కూడా వీడియోలు చేస్తూ ఉంటుంది.ఆ వీడియోలు చాలా వైరల్ అవుతుంటాయి.

"""/" / ఇక తాజాగా నిరూపమ్ మరో వీడియో షేర్ చేసుకోగా ఆ వీడియో బాగా వైరల్ గా మారింది.

అందులో తన భార్య మంజుల తో కలిసి ఏడువారాల నగలు కొనుగోలు చేయటానికి వెళ్ళాడు.

ఇక ఆ వీడియోలో మంజుల అన్ని నగలు వేసుకుంటూ చూపించగా మధ్య మధ్యలో నిరూపమ్ పంచులు వేస్తూ కనిపించాడు.

మీ ఆడాళ్ళతో ఇదే పిచ్చి అంటూ కామెంట్ కూడా చేశాడు.ఇక ప్రస్తుతం ఆ వీడియో బాగా వైరల్ గా మారింది.

Aussie Play Review And Player Reputation (AU) — Aussie Play Explained For Australian Punters