డబల్ ఇస్మార్ట్ టీజర్ డేట్ ఫిక్స్ చేసిన పూరి…ఎప్పుడు వస్తుందంటే..?

తెలుగులో డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్న డైరెక్టర్ పూరి జగన్నాథ్( Puri Jagannadh ).

ఈయన చేసిన వరుస సినిమాలు ఇండస్ట్రీ లో సూపర్ సక్సెస్ లను సాధిస్తూ ఆయనకి స్టార్ డమ్ ను తీసుకువచ్చి పెట్టాయనే చెప్పాలి.

ఇక ఇప్పుడు పూరి రామ్ ని హీరోగా పెట్టి డబల్ ఇస్మార్ట్( Double ISmart ) అనే సినిమా చేస్తున్నాడు.

ఇక నిజానికి ఈ సినిమా ఇస్మార్ట్ శంకర్ సినిమాకి సీక్వెల్ గా వస్తుంది.

అయినప్పటికీ ఈ సినిమా మీద మంచి అంచనాలైతే ఉన్నాయి. """/" / ఇక సినిమా యూనిట్ ఈ సినిమాకి సంబంధించిన టీజర్ ని తొందర్లోనే రిలీజ్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నట్లుగా తెలుస్తుంది.

ఇక మొత్తానికైతే రామ్ ఈ సినిమాతో ఒక సాలిడ్ హిట్ ను కొట్టబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక గత సంవత్సరం బోయపాటి డైరెక్షన్ లో చేసిన స్కంద సినిమా( Skanda ) మీద భారీ ఆశలు పెట్టుకున్నప్పటికీ ఆ సినిమా ఫ్లాప్ అయింది.

ఇక దాంతో ఇప్పుడు చేయబోయే ఈ సినిమాతో తను కంబ్యాక్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక మొత్తానికైతే డబల్ ఇస్మార్ట్ సినిమా ఇటు పూరీకి, అటు రామ్ కి ఇద్దరికీ కూడా మంచి సక్సెస్ ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది.

ఇక ఈ సినిమా టీజర్ ని మేలో రిలీజ్ చేసే అవకాశాలు అయితే పుష్కలంగా ఉన్నాయి.

"""/" / ఇక టీజర్ తోనే సినిమా మీద హైప్ పెంచే ప్రయత్నంలో పూరి జగన్నాథ్ ఉన్నట్టుగా తెలుస్తుంది.

పూరి గత సినిమా అయిన లైగర్ భారీ డిజాస్టర్ అవ్వడంతో పాన్ ఇండియాలో ఆయనకు చాలా బ్యాడ్ నేమ్ అయితే వచ్చింది.

ఇప్పుడు ఈ సినిమాతో సక్సెస్ కొట్టి మరోసారి తనని తాను ప్రూవ్ చేసుకోవాలనే ప్రయత్నంలో ఉన్నట్టుగా తెలుస్తుంది.

పూరి కనక ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ని అందుకుంటే మరోసారి ఆయనకి స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం అయితే దక్కుతుంది.

ఐర్లాండ్‌లో మేయర్‌గా ఎన్నికైన మలయాళీ.. తొలి భారత సంతతి నేతగా చరిత్ర