‘డబుల్ ఇస్మార్ట్’ సెకండ్ షెడ్యూల్.. థాయిలాండ్ లో అలా మొదలు..

ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని ఇష్మార్ట్ శంకర్, ది వారియర్ సినిమాలతో మాస్ హీరోగా కొత్తగా అవతరించాడు.

మాస్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, రామ్ పోతినేని కాంబోలో వచ్చిన ఇష్మార్ట్ శంకర్ సినిమాతో ఇద్దరు సాలిడ్ హిట్ అందుకుని భారీ క్రేజ్ తెచ్చుకున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత ఇద్దరు చేసిన సినిమాలతో ప్లాప్ అందుకున్నారు.రామ్ ది వారియర్ సినిమాతో, పూరీ జగన్నాథ్( Puri Jagannadh ) లైగర్ సినిమాతో ప్లాప్స్ ను అందుకోవడంతో ఈ జోడీ ఇప్పుడు మరోసారి కలిసి పని చేస్తుంది.

నాలుగేళ్ళ తర్వాత వీరి కాంబోలో ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్( Double ISmart ) తెరకెక్కుతుండటం విశేషం.

కొద్దీ రోజుల క్రితమే గ్రాండ్ గా లాంచ్ చేసి షూట్ స్టార్ట్ చేసి మొదటి షెడ్యూల్ కూడా పూర్తి ఫాస్ట్ గా పూర్తి చేసారు.

"""/" / పూరీ టేకింగ్ ఎంత ఫాస్ట్ గా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు.

ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా నెక్స్ట్ షెడ్యూల్ కూడా తాజాగా స్టార్ట్ అయినట్టు తెలుస్తుంది.

ఈ మేరకు మేకర్స్ అఫిషియల్ అప్డేట్ సైతం ఇచ్చారు.సెకండ్ షెడ్యూల్ ను థాయిలాండ్ లో స్టార్ట్ చేస్తున్నట్టు ఒక ఫోటో రిలీజ్ చేస్తూ తెలిపారు.

కాగా ఈ షెడ్యూల్ లో ఇంటర్వెల్ సీక్వెన్స్ ను తెరకెక్కిస్తున్నారట. """/" / రామ్, విలన్ గా నటిస్తున్న సంజయ్ దత్( Sanjay Dutt ) మీద మాస్ యాక్షన్ సీక్వెన్స్ ను షూట్ చేస్తున్నారట.

ఈ సీక్వెన్స్ లో రామ్ పై సంజయ్ దత్ ఎటాక్ చేస్తూ చాలా వైల్డ్ గా కనిపిస్తాడని అంటున్నారు.

ఈ సీన్స్ నే ప్రజెంట్ థాయిలాండ్ లో షూట్ చేస్తున్నారట.మొత్తానికి పూరీ స్ట్రాంగ్ కమ్ బ్యాక్ ఇవ్వడానికి రామ్ తో సిద్ధం అవుతున్నాడు.

కాగా ఈ సినిమా వచ్చే ఏడాది మార్చి 8న రిలీజ్ కానుండగా ఛార్మి కౌర్ తో కలిసి పూరీ కనెక్ట్స్ పై విష్ణు రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.

ఇక రామ్ పోతినేని వారియర్ తర్వాత బోయపాటి దర్శకత్వంలో స్కంద సినిమా చేస్తుండగా సెప్టెంబర్ 15న ఈ సినిమాను పాన్ ఇండియా వ్యాప్తంగా రిలీజ్ చేయనున్నారు.

దీంతో మరో మాస్ హిట్ అందుకుంటాడా లేదా చూడాలి.

హత్య సినిమా రివ్యూ అండ్ రేటింగ్!