మందుబాబుల‌కు డ‌బుల్ కిక్కు.. తెల్ల‌వారు 3గంట‌ల దాకా బార్లు ఓపెన్‌..

మందుబాబులకు ఢిల్లీ సర్కార్​ గుడ్​ న్యూస్​ చెప్పింది.ఇక తెల్లవారుజామున మూడు గంటల వరకు తాగేందుకు అనుమతినిచ్చింది.

అదేనండి పొద్దున పది గంటలకు బార్లు తెరిస్తే ఇక తెల్లవారు జామున మూడు గంటల వరకు నడుపుకునేందుకు పర్మిషన్​ ఇచ్చింది.

దీంతో మందుబాబులు చాలా ఆనందపడుతున్నారు.రాత్రి 11 గంటల వరకే ఉండే బార్లు తెల్లవారుజాము వరకు ఉండే అవకాశం ఉండటంతో ఇక తీరిగ్గా కూర్చోని తాగొచ్చు అని ఆలోచిస్తున్నారు.

రాత్రి సమయం వరకు ఉద్యోగాలు చేసేవారు సరిగ్గా బార్​ మూసేసే సమయానికి అంటే అర్ధరాత్రి సమయానికి హడావిడిగా బార్​కు వెళ్లి తాగేసి, ఇంటికి తిరుగుముఖం పట్టే పరిస్థితులు ఇక ఉండబోవని ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

కేజ్రీవాల్​ సర్కార్ నిర్ణయం పట్ల ముందు బాబులు హాహటంగానే హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఎందుకంటే వారు కోరుకునే ది కూడా ఇదే కాబ‌ట్టి. """/"/ అయితే ఢిల్లీ సర్కార్​ నిర్ణయం పట్ల మహిళలు, గృహిణిలు, పలువురు సోషల్​ యాక్టివిస్టులు మాత్రం మండిపడుతున్నారు.

ఇప్పటికే తాగి ఆరోగ్యం పాడుచేసుకోవడమే కాక, డబ్బును వృథా చేస్తున్న మందుబాబులు ఇంకా రెచ్చిపోయే అవకాశం ఉందని, ఇక తెల్లవారే వరకు తాగుతూ బార్లలోనే కూర్చుంటారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పుడు అర్ధరాత్రి వరకు అయినా ఇంటికి వస్తున్నారని, ఇక నుంచి ఎప్పుడు వస్తారో తెలియదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

మందు తాగడం వల్ల అనేక అనార్థాలు ఉన్నాయని తాము ప్రచారం చేస్తుంటే.ఢిల్లీ ప్రభుత్వం ఇలాంటి నిర్ణయం తీసుకోవడం ఏంటని సోషల్​ యాక్టివిస్టులు ప్రశ్నిస్తున్నారు.

కానీ కొత్త మద్యం పాలసీ తీసుకురావడం పట్ల ఢిల్లీ సర్కారు కూడా ఇష్టం లేదని తెలుస్తోంది.

కానీ ఇప్పటికే కరోనా వల్ల అతలాకుతలం అయిన రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని మద్యం అమ్మకాల ద్వారా కొంత మెరుగుపర్చుకోవాలని చూస్తోందని తెలుస్తోంది.

హీరోల ఓవరేక్షన్ వలన ప్లాప్ అయిన సినిమాలు ఇవే!