నిరాశపరిచిన డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ కలెక్షన్లు.. ఇంత తక్కువ వస్తే ఎలా అంటూ?

గురువారం రోజున ఇండిపెండెన్స్ డే ( Independence Day )కానుకగా ఏకంగా నాలుగు సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి.

టాలీవుడ్ ఇండస్ట్రీ నుంచి డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్, ఆయ్ ( Double Smart, Mr.

Bachchan, Aye )సినిమాలు విడుదల కాగా కోలీవుడ్ ఇండస్ట్రీ నుంచి తంగలాన్ మూవీ( Tangalan Movie ) విడుదలైంది.

ఈ నాలుగు సినిమాలలో తంగలాన్, అయ్ సినిమాలకు పాజిటివ్ టాక్ రాగా మిగతా రెండు సినిమాలకు మిక్స్డ్ టాక్ వచ్చింది.

డబుల్ ఇస్మార్ట్, మిస్టర్ బచ్చన్ సినిమాలు భారీ అంచనాలతో థియేటర్లలో విడుదలైనా ఈ సినిమాల ఫస్ట్ డే కలెక్షన్లు మాత్రం ఆశించిన స్థాయిలో లేవు.

"""/" / డబుల్ ఇస్మార్ట్ సినిమాకు 12 కోట్ల 45 లక్షల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయని మిస్టర్ బచ్చన్ సినిమాకు ఏడు కోట్ల 50 లక్షల రూపాయల కలెక్షన్లు వచ్చాయని సమాచారం అందుతోంది.

అయితే ఈరోజు ఈ రెండు సినిమాలకు బుకింగ్స్ ఆశాజనకంగా లేకపోవడం హాట్ టాపిక్ అవుతుంది.

ఫస్ట్ వీకెండ్ కలెక్షన్లను బట్టి ఈ రెండు సినిమాల తుది ఫలితాల గురించి ఒక అంచనాకు రావచ్చు.

మాస్ మహారాజ్ రవితేజ, ఎనర్జిటిక్ స్టార్ రామ్ కోరుకున్న భారీ విజయాలు మాత్రం ఈ సినిమాలతో దక్కలేదని కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి.

"""/" / మరోవైపు స్టార్ హీరో రామ్ తర్వాత మూవీ హరీష్ శంకర్ ( Harish Shankar )దర్శకత్వంలో తెరకెక్కనుంది.

పవన్ కళ్యాణ్ పొలిటికల్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న నేపథ్యంలో హరీష్ శంకర్ ప్రాజెక్టులపై దృష్టి పెట్టారు.

రామ్ హరీష్ శంకర్ కాంబో మూవీ ఎలా ఉండనుందో చూడాల్సి ఉంది.ఈ సినిమా ఏ బ్యానర్ పై తెరకెక్కనుందనే ప్రశ్నకు సైతం సమాధానం దొరకాల్సి ఉంది.

స్టార్ హీరో రామ్ కెరీర్ ను మరింత జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సిన తరుణం ఆసన్నమైందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

హిట్ ఫ్లాప్స్ తో సంబంధం లేకుండా రామ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది.

దంతాల‌పై ప‌సుపు మ‌ర‌క‌ల‌ను పోగొట్టే బెస్ట్ హోమ్ రెమెడీస్ మీకోసం!