ఆహారంపై ఉమ్మివేస్తూ కెమెరాకు చిక్కిన డెలివరీ డ్రైవర్.. కంపెనీ ఇచ్చిన షాక్‌కి లబోదిబో!
TeluguStop.com
బాగా ఆకలేస్తుందని ఆన్‌లైన్‌లో ఫుడ్ ఆర్డర్( Online Food Order ) చేసిన తల్లీకొడుకులకు చేదు అనుభవం ఎదురయింది.
ఫ్లోరిడాకు చెందిన 13 ఏళ్ల బాలుడు, అతని తల్లి ఇటీవల డోర్‌డ్యాష్ ఫుడ్ డెలివరీ కంపెనీ నుంచి ఫుడ్ ఆర్డర్ చేశారు.
దాన్ని డెలివరీ చేయడానికి వచ్చిన డ్రైవర్ ఒక రోత పనిచేశాడు.అతను ఇంటి ముందు డెలివరీ చేసిన ఆహారంపై ఉమ్మివేశాడు.
అతడు చేసిన ఈ పని కెమెరాలో రికార్డు అయింది.టిప్ చాలా తక్కువగా ఇచ్చారన్న కోపంతో డ్రైవర్ ఇలా చేసి ఉండవచ్చు.
నిజానికి తల్లీకొడుకులు ఆర్డర్ కోసం సుమారు 30 డాలర్లు చెల్లించారు.డ్రైవర్‌కు 3 డాలర్లు టిప్ ఇచ్చారు.
"""/"/
డ్రైవరు ఫుడ్ పై ఉమ్మివేస్తున్న( Spitting On Food ) వీడియో చూసి బాలుడు అసహ్యం వ్యక్తం చేశాడు.
ఆ ఆహారాన్ని చెత్త కుప్పలో విసిరేయాలనుకుంటున్నట్లు చెప్పాడు.అతను డోర్‌డ్యాష్ సిబ్బందితో వీడియోను పంచుకున్నాడు.
రిఫండ్ కోసం అడిగాడు, అయితే మొదట కంపెనీ రిఫండ్ ఇచ్చేందుకు ఒప్పుకోలేదు.ఒక కస్టమర్ సర్వీస్ ప్రతినిధి చివరికి బాలుడికి వాపసు ఇచ్చారు.
డ్రైవర్ ప్రవర్తనను క్షమించడం లేదని, అతనిని తన ప్లాట్‌ఫామ్ నుంచి తొలగించినట్లు డోర్‌డ్యాష్ తెలిపింది.
ఇకపై డోర్‌డ్యాష్( DoorDash ) కోసం డ్రైవర్ ఆహారాన్ని డెలివరీ చేయలేరని కంపెనీ తెలిపింది.
"""/"/
డోర్‌డ్యాష్ డ్రైవర్ తప్పు చేస్తూ కెమెరాకు చిక్కడం ఇదే మొదటిసారి కాదు.
జులైలో, డోర్‌డ్యాష్ డ్రైవర్( DoorDash Driver ) $20 ఆర్డర్‌పై $5 టిప్ ఇచ్చినందుకు టెక్సాస్ మహిళపై మాటలతో దాడి చేసిన వీడియో వైరల్ అయింది.
మహిళ ఇల్లు బాగుంది కానీ డ్రైవరు 5 డాలర్ల టిప్ మాత్రమే ఇస్తుందని ఫైర్ అయ్యాడు.
ఈ సంఘటనలు అన్ని డోర్‌డ్యాష్ డ్రైవర్లు తక్కువ టిప్స్ ఇస్తే ఏదో ఒక చెడ్డ పని చేస్తారని తెలుస్తోంది.
అమెరికాలో ఉంటున్న ఎన్నారైలు కూడా డెలివరీ డ్రైవర్లతో జాగ్రత్తగా ఉండటం మంచిది ఒక కంపెనీ డ్రైవర్లు ఎలా ప్రవర్తిస్తారో తెలుసుకునేందుకు దాని ఆన్‌లైన్ రివ్యూస్ చదవవచ్చు.
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – నవంబర్22, శుక్రవారం 2024