ఆ తీర్పులపై కమిషన్ వేయకూడదు అని మీకు తెలియదా ? కేసీఆర్ ఫైర్ 

తెలంగాణ  ఎన్నికల్లో ఓటమి చెందినప్పటి నుంచి సైలెంట్ గానే ఉంటూ వస్తున్న బీఆర్ఎస్ అధినేత,  మాజీ సీఎం కేసీఆర్( KCR ) మళ్లీ ఫామ్ లోకి వచ్చినట్టుగా కనిపిస్తున్నారు.

తాజాగా తెలంగాణలో విద్యుత్ కొనుగోలు , కొత్త ప్రాజెక్టుల నిర్మాణ టెండర్లపై కేసీఆర్ లేక ద్వారా వివరణ ఇచ్చారు .

ఈ మేరకు జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ కు కెసిఆర్ లేక రాశారు.

అన్ని రకాల చట్టాలు,  నిబంధనలు పాటిస్తూ ముందుకు వెళ్లామని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు.

ఈ ఆర్ సీ ఇచ్చిన తీర్పులపై కమిషన్  వేయకూడదు అన్న విషయం ప్రభుత్వానికి తెలియదా అంటూ కేసిఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.

తెలంగాణ ఏర్పడిన తొలినాళ్లలో విద్యుత్ సంక్షోభం తీవ్రంగా ఉంది.ఇది జగమెరిగిన సత్యం.

పార్లమెంట్ ఎన్నికలకు ముందే కేసీఆర్ కు కమిషన్ నోటీస్ జారీ చేసింది  పార్లమెంట్ ఎన్నికలు ఉన్నందున జూలై 30 వరకు వివరణకు అవకాశం ఇవ్వాలని కేసీఆర్ కోరగా , కమిషన్ మాత్రం జూన్ 15 వరకు గడువు ఇచ్చింది .

దీంతో కమిషన్ కు 12 పేజీల లేఖను కేసీఆర్ రాశారు . """/" / '' రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లలో విద్యుత్ సంక్షోభం విపరీతంగా ఉంది.

  తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అత్యంత దారుణంగా ఉన్న విద్యుత్ రంగం వల్ల ఒక్క సెక్టార్ కూడా సక్రమంగా నడవలేకపోయింది.

రాష్ట్రంలో పవర్ హాలిడేలు కరెంటు కోతలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.

నాడు గ్రామాల్లో ఉదయం 3 గంటలు సాయంత్రం మూడు గంటలు కరెంటు కోతలు ఉండేవి .

త్రీఫేస్ కరెంటు కావాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది.దీన్ని అధిగమించేందుకు తెలంగాణకు చట్ట ప్రకారం 53.

89 శాతం, ఆంధ్రకు 46.1% కేటాయించి ఆ విధంగా పది సంవత్సరాల పాటు విద్యుత్ వినియోగించుకోవాలని నిర్దేశించింది విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఆనాటి ప్రభుత్వం తెలంగాణకు కరెంటు సరఫరా ఇవ్వలేదు .

2,400 మెగావాట్ల లోటు ఏర్పడింది మొత్తంగా ఐదు వేల మెగావాట్ల కొరతతో తెలంగాణలోని విద్యుత్ రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది ' అంటూ కేసిఆర్ లేఖలో పేర్కొన్నారు.

' """/" / తీవ్ర సంక్షోభం ను అధిగమించి కొత్త ప్రాజెక్టులు నిర్ణయించి కొత్త ప్లాంట్ లు ఏర్పాటు చేసాం దీంతో రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు 7, 778 మెగావట్ల కు పైచిలుకు చేరడం మా ప్రభుత్వానికి నిదర్శనం తెలంగాణలో ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త ఇప్పుడు కరెంటు పోతే వార్త రాజకీయ కక్షతో నన్ను అప్పటి మా ప్రభుత్వాన్ని అప్రతిష్ట పాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం వ్యచారణ కమిటీ ఏర్పాటు చేసింది కరెంటు కోసం గూర్చిన తెలంగాణలో అప్పటి మా ప్రభుత్వం గణనీయంగా మార్పు చూపించి అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే .

తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చి పదేళ్లు పరిపాలించిన నా పేరును ప్రస్తావించడం , లోక్ సభ ఎన్నికల( Lok Sabha Elections ) నేపథ్యంలో నేను వ్యవధి అడిగితే దాన్ని కూడా ఏదో దయ తంచి ఇచ్చినట్లుగా మాట్లాడడం నాకు ఎంతో బాధ కలిగించింది.

ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉందన్నట్లు మీ మాటలు స్పష్టం చేస్తున్నాయి.

మీ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది విచారణ పూర్తికాకముందే తీర్పు ప్రస్తావించినట్లుగా మీ మాటలు ఉన్నాయి.

మీ విచారణలో నిస్పాక్షి కథ ఎంత మాత్రం కనిపించడం లేదు.అందువల్ల ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టం అవుతుంది.

పైన పేర్కొన్న అన్ని అంశాలను పరిగణలోకి తీసుకుని మీరు ఈ ఎంక్వైరీ కమిషన్ బాధ్యతలు నుంచి స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా.

చట్టబద్ధత కలిగిన ఈ ఆర్ సి వెలువరించిన తీర్పులపై విచారణ చేయవద్దన్న ఇంగితం ప్రభుత్వం కోల్పోయింది.

ఈ ఆర్ సి వివరించిన తీర్పులపై ఎంక్వైరీ కమిషన్ వేయకూడదు అని ప్రభుత్వానికి సూచించాల్సిన మీరు బాధ్యతలు స్వీకరించడం విచారకరం ' అని జస్టిస్ నరసింహారెడ్డి నీ ఉద్దేశించి కెసిఆర్ లేఖ రాశారు.