హెయిర్ ఫాల్‌తో చింతే వద్దు.. ఈ రెమెడీని ట్రై చేస్తే ఒక్క వెంట్రుక కూడా రాలదు!
TeluguStop.com
హెయిర్ ఫాల్.స్త్రీలే కాదు ఎందరో పురుషులు సైతం ఈ సమస్యతో బాధపడుతున్నారు.
అందులోనూ పెళ్లి కాని యువతీ, యువకులు హెయిర్ ఫాల్‌తో పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు.
జుట్టు రాలడాన్ని ఎలా ఆపాలో తెలియక చాలా మంది మానసికంగా కూడా కృంగిపోతుంటారు.
ఈ జాబితాలో మీరు ఉన్నారా.? అయితే హెయిర్ ఫాల్‌తో చింతే వద్దు.
ఎందుకంటే, ఇప్పుడు చెప్పబోయే సూపర్ పవర్ ఫుల్ రెమెడీని ట్రై చేస్తే ఒక్క వెంట్రుక కూడా రాలదు.
మరి ఆలస్యమెందుకు ఆ రెమెడీ ఏంటో.దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో.
తెలుసుకుందాం పదండీ.ముందుగా ఒక కీర దోసకాయను తీసుకుని నీటిలో శుభ్రంగా కడిగి.
సన్నగా తురుముకోవాలి.ఈ తురుము నుండి జ్యూస్‌ను సపరేట్ చేసి పెట్టుకోవాలి.
అలాగే ఒక ఆరెంజ్ పండును తీసుకుని సగానికి కట్ చేసి.జ్యూస్‌ను పిండాలి.
ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని అందులో ఐదు టేబుల్ స్పూన్ల పెసర పిండి.
ఒక కోడి గుడ్డు వేసుకుని బాగా కలపాలి.ఆ తర్వాత అందులో సపరేట్ చేసి పెట్టుకున్న కీర జ్యూస్, ఆరెంజ్ జ్యూస్ లను మూడు టేబుల్ స్పూన్ల చప్పున వేసుకోవాలి.
అలాగే వన్ టేబుల్ స్పూన్ పెరుగు, నాలుగు చుక్కలు టీట్రీ ఎసెన్షియల్ ఆయిల్ వేసుకుని అన్నీ కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి.
ముందు రోజు సాయంత్రం తలస్నానం చేసి, మర్నాడు ఉదయం ఈ ప్యాక్‌ను వేసుకోవాలి.
"""/"/
ఆపై షవర్ క్యాప్‌ను ధరించి.గంట అనంతరం హెయిర్ వాష్ చేసుకోవాలి.
వారానికి ఒకసారి ఈ రెమెడీని ట్రై చేస్తే జుట్టు రాలడం క్రమంగా తగ్గిపోయి.
ఒత్తుగా, పొడవుగా పెరుగుతుంది.పైగా ఈ రెమెడీని ప్రయత్నించడం వల్ల జుట్టు కుదుళ్లు సైతం బలంగా మారతాయి.
ఇలా చేయండి గూగుల్ పేలో రూ. 1000 దాకా సంపాదించండి!