ఉద్యోగం పోయిందని చింతించకండి.. బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు టిప్స్ ఇవే

ఇటీవల కాలంలో పెద్ద పెద్ద కంపెనీలు లేఆఫ్‌లు ఇస్తున్నాయి.పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగిస్తున్నాయి.

ట్విట్టర్, అమెజాన్, మెటా వంటి కంపెనీలతో పాటు దేశీయ కంపెనీలు అయిన బైజూస్, అన్ అకాడమీ వంటి కంపెనీలు ఇదే బాటలో పయనిస్తున్నాయి.

ఖర్చులు తగ్గించుకునేందుకు ఇలా ఉద్యోగులను తొలగించేందుకు కంపెనీలు చూస్తున్నాయి.చాలా మంది ఉద్యోగాలు కోల్పోయి, నైరాశ్యంలో కూరుకుపోయారు.

అకస్మాత్తుగా ఉద్యోగం పోవడంతో చాలా మంది ఆందోళన చెందుతున్నారు.అయితే ఉద్యోగం పోయినా ట్యాలెంట్‌కు కొదువ లేదు.

త్వరలోనే ఉద్యోగం సంపాదించగలరు.అందుకు ముందుగా పోయిన ఆత్మవిశ్వాసాన్ని మీలో పెంచుకోవడం ముఖ్యం.

ఇక మీరు బౌన్స్ బ్యాక్ అయ్యేందుకు కొన్ని సూచనలు పాటించండి.ఉద్యోగం కోల్పోయినందుకు కుమిలిపోవద్దు.

మీ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోండి.ధ్యానం, వ్యాయామం వంటివి చేయండి.

మీ మనసు మార్చే మరేదైనా పని చేయండి.ఉద్యోగం కోల్పోయిన విషయాన్ని మీలో మీరే దాచుకోకండి.

ఇతరులకు చెప్పండి.సన్నిహితులకు, స్నేహితులకు చెప్పడం వల్ల మరో ఉద్యోగాన్ని పొందే వీలుంది.

వారికి తెలిసిన చోట్ల ఉద్యోగ అవకాశాలు ఉంటే మీకు చెప్పే అవకాశం ఉంది.

ఉద్యోగం పోతే ఆర్థిక ఇబ్బందులు చుట్టుముడతాయి.కాబట్టి మీరు ఖర్చులు తగ్గించుకోవాలి.

"""/"/ అవసరమైన వాటికి మాత్రమే ఖర్చు చేయాలి.అనవసర విషయాల గురించి ఎక్కువగా ఆలోచించి ఆరోగ్యం పాడు చేసుకోకూడదు.

మీకు అవసరమైన కొత్త నైపుణ్యాన్ని ఏదైనా నేర్చుకోవడానికి ప్రయత్నించండి.మీరు మీ రెజ్యూమ్‌ను అప్‌డేట్ చేసుకోండి.

మీరు ఇప్పుడే మీ ఉద్యోగాన్ని పోగొట్టుకున్నట్లయితే, రీసెట్ చేయడానికి ఇది మంచి సమయం.

బహుశా మీరు మీ మునుపటి ఉద్యోగంలో సంతోషంగా లేకపోవచ్చు.లేదా, మీరు ఎల్లప్పుడూ మీ మనస్సులో కెరీర్ ఆకాంక్షను కలిగి ఉండవచ్చు.

మరింత పెద్ద ఉద్యోగానికి ప్రయత్నించండి.ఇది సఫలం అయితే మీ కెరీర్ మరింత పురోగమిస్తుంది.

కెనడాలో ఫ్రీ ఫుడ్ పొందచ్చంటూ ఎన్నారై వీడియో.. కట్ చేస్తే జాబ్ గోవిందా..??