అమెరికాలో ఆ ఫ్యాన్లు వాడద్దు..హెచ్చరించిన ప్రభుత్వం..!!

మనం కొన్న వస్తువులో ఏదన్నా సమస్య వస్తే కొన్న షాపు వాడిని అడుగుతాం, వాడు చేస్తాం చూస్తాం అంటూ నసుగుతూ విసుగ్గా సమాధానం చెప్తూ బాగుచేయించి ఇస్తాం అని తేలిగ్గా తీసుకుంటాడు.

మరో కొందరైతే మీ దగ్గర ఎదో జరిగింది మాకేం సంభంధం లేదు పొమ్మంటాడు.

కాస్తో కూస్తో కనికరం ఉన్న షాపు వాడైతే సరే వేరేది ఇస్తానని సర్ది చెప్పుకుంటాడు.

అంతేగాని ఎవరన్నా మా వస్తువులు కొనద్దు వాటిలో సమస్య ఉందని చెప్పుకుంటారా చచ్చినా చెప్పుకోరు, ప్రభుత్వం ఏమన్నా సదరు వస్తువు గురించి హెచ్చరిస్తుందా అస్సలు చేయనే చేయదు.

కానీ అమెరికాలో ఫ్యాన్స్ తయారు చేసే ఓ కంపెనీ మాత్రం తాము తయారు చేసిన ఈ మోడల్ ఫ్యాన్ కొనకండి, ఒక వేళ కొంటె అస్సలు వాడద్దు, తిరిగి ఇచ్చేయండి అంటూ ప్రకటనలు జారీ చేసింది.

అంతేకాదు అమెరికా కన్జ్యూమర్ ప్రోడక్ట్ సేఫ్టీ కమిషన్ కూడా అదరు కంపెనీ ఫ్యాన్స్ వాడద్దని హెచ్చరించింది.

అయితే ఈ ఫ్యాన్ గోల ఏంటి అసలు ఎందుకు ఈ ఫ్యాన్స్ వాడద్దని కంపెనీ సైతం కష్టమర్ల కు ఫోన్ లు చేసి మరీ చెప్తోందంటే అందుకు రీజన్ లేకపోలేదు.

"""/"/ అమెరికాలో కింగ్ ఆఫ్ ఫ్యాన్స్ అనే సంస్థ కి మంచి పేరు ఉంది.

ఈ సంస్థ నుంచి వచ్చిన ఓ మోడల్ ఫ్యాన్ లో లోపం ఏర్పడింది.

ఫ్యాన్ తిరుగుతూ ఉండగానే రెక్కలు విరిగి పడిపోతున్నాయి.దాంతో ఈ ఫ్యాన్స్ కొన్న వాళ్ళు సదరు సంస్థకు ఫోన్ చేసి ఫ్యాన్ రెక్కలు ఊడి పడిపోతున్నాయి మాకు ఆస్తి నష్టం కలిగిందని, గాయాలు అవుతున్నాయని చెప్పగా సదరు సంస్థ వెంటనే స్పందించింది.

అలాగే ఈ పరిస్థితిని గుర్తించిన సేఫ్టీ కమిషన్ కూడా ప్రజలను అలెర్ట్ చేసింది.

అరెస్ట్ కోసం ఆరాటపడుతున్న కేటీఆర్ .. ఎందుకు అందుకేనా ?