పోటాపోటీగా ఉన్న నియోజకవర్గాల్లో నిర్లక్ష్యం వద్దు.. సీఎం రేవంత్ సూచనలు
TeluguStop.com
కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థులతో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth) జూమ్ మీటింగ్ నిర్వహించారు.
ఈ సమావేశంలో కాంగ్రెస్(Congress) ఇంఛార్జ్ మున్షీతో పాటు 17 మంది ఎంపీ అభ్యర్థులు పాల్గొన్నారు.
కౌంటింగ్ సందర్భంగా అభ్యర్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) దిశానిర్దేశం చేశారు.
ఈ క్రమంలోనే ఓట్ల లెక్కింపు సమయంలో అభ్యర్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.పోటాపోటీగా ఉన్న నియోజకవర్గాల్లో నిర్లక్ష్యం వద్దని చెప్పారు.
చిత్తశుద్ధి, నిబద్ధత ఉన్న వారిని మాత్రమే ఏజెంట్ గా పంపాలన్న సీఎం రేవంత్ రెడ్డి సీనియర్ నేతలను కూడా కౌంటింగ్ కేంద్రాలకు తీసుకెళ్లాలని తెలిపారు.