వైరల్.. సింహంతో పరాచికాలు ఆడాడు..చివరకి పంజా రుచి చూపించేసింది !
TeluguStop.com
అడవిలో ఉండే వన్య మృగాలతో చాలా జాగ్రత్తగా ఉండాలి.వాటితో ఎంతో జాగ్రత్తగా ఉంటేనే అవి మన మీద దాడి చేయడానికి రెడీగా ఉంటాయి.
ఇంకా వాటిని రెచ్చగొడితే ఏమైనా ఉందా.ఒక్కసారిగా విజృంభించి తమ ప్రతాపాన్ని చూపిస్తాయి.
ముఖ్యంగా సింహాలతో చెలగాటం అంత మంచిది కాదు.అడవికి రాజుగా ఉండే సింహంతో అయితే అస్సలే పరాచికాలు ఆడకూడదు.
మామూలుగానే సింహాలు వేటాడడంలో ముందు వరసలో ఉంటాయి.వేట ఆడి ఎంతటి వారినైనా తన పంజాతో బలి తీసుకునే సత్తా ఉంటుంది.
అలాంటిది దాని ముందు కుప్పిగంతులు వేస్తె ఊరుకుంటుందా.అస్సలు ఊరుకోదు.
అందుకే దాని పంజా రుచి చూపించింది.ఒక వ్యక్తి సింహంతో చెలగాటం ఆడాలని చూసాడు.
కానీ అది ఊరుకుంటుందా.దాని సత్తా చూపించింది.
తాజాగా ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.ఒక వ్యక్తి బోనులో ఉన్న సింహం దగ్గరకు వెళ్ళాడు.
వెళ్లినవాడు కాస్త దూరంగా ఉండి చూస్తే ఏమి అయ్యేది కాదు.కానీ ఆ వ్యక్తి ఆ సింహం దగ్గరకు వెళ్లి సింహం తోనే ఆటలు ఆడడం మొదలు పెట్టాడు.
అయినా ఆ సింహం కొద్దిసేపు మౌనం వహించింది.కానీ అతడు చేసే వేషాలకు ఆ సింహం కూడా విసిగి పోయినట్లు ఉంది.
అక్కడికి ఆ సింహం అతడిని గాండ్రించి హెచ్చరించింది.అయినా ఆ వ్యక్తి హీరోలా ఫోజులు కొట్టడంతో ఇక ఆ సింహం అతడిపై తన పంజా విసిరింది.
బోను లోపల చెయ్యి పెట్టి దాని తల నిమరాలని చూడడంతో ఆ సింహం అతడి చేతిపై దాడి చేసింది.
అది నోట్లో చేయి పెట్టుకోగానే అతడు బాధతో విలవిల్లాడడంతో పక్కన ఉన్న వ్యక్తులు కూడా ఒక్కసారిగా అరవడంతో సింహం వదిలేసింది.
వెంటనే అతడు తన చేతిని తీసేసుకున్నాడు.ఇప్పుడు ఈ వీడియో నెట్టింట వైరల్ అయ్యింది.
ఆ హీరోకేమైనా కాళ్లు, చేతులు పోయాయా.. సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు వైరల్!