వైరల్: గాడిదకేం తెలుసు సంగీతం అని చిన్నచూపు చూడొద్దు… ఇక్కడ చూడండి!

సోషల్ మీడియా( Social Media ) అందుబాటులోకి వచ్చాక ప్రపంచం నలుమూలలా జరిగే అనేక వింతలు, విశేషాలను యిట్టె తెలుసుకోగలుగుతున్నాం.

ఈ క్రమంలో ఒక్కోసారి మనల్ని మనమే నమ్మలేని విషయాలకు సంబంధించిన వీడియోలు ఇక్కడ వైరల్ అవుతూ వుంటాయి.

అటువంటి వాటిని చూసి విస్తుపోవడం తప్ప ఇంకేమి చేయలేము.సరిగ్గా ఆ రకానికి చెందిన వీడియో ఒకటి నెట్టింట వైరల్ అవుతోంది.

ఈ వీడియో చూసిన తర్వాత మిమ్మల్ని మీరే నమ్మలేరు అని చెప్పడంలో సందేహమే లేదు.

మీరు ఎప్పుడైనా గాడిద( Donkey ) స్వరం విన్నారా? గాడిద గాండ్రీంపు ఎవ్వరికి తెలియదు అని అంటారా? అది కాదండీ.

గాడిద పాటపాడడం ఎపుడైనా విన్నారా అని? వినలేదు కదూ.అయితే ఇక్కడ వైరల్ అవుతున్న వీడియోని ఒకసారి పరిశీలిస్తే ఓ గాడిద మధురమైన శబ్దాలు చేయడం గమనించవచ్చు.

అవును, వినడానికి విడ్డురంగా వున్నా, మీరు విన్నది నిజం.కోకిల కమ్మని రాగంలా, నెమలి వయ్యారి నాట్యంలా, ఇక్కడ గాడిద మధురమైన స్వరంతో తియ్యగా పాడుతోంది.

ఈ వీడియోలో గాడిదను చూసి మీరు కూడా గందరగోళానికి గురవ్వడం ఖాయం. """/" / వైరల్ అవుతున్న వీడియోని ఒకసారి గమనిస్తే, ఇక్కడ ఓ గాడిద ఏదో చెప్పాలని ప్రయాస పడుతున్నట్టుంది.

ఈ క్రమంలో శబ్దాలు చేయడం ప్రారంభిస్తుంది.కాగా ఈ వాయిస్ ఏదో కూనిరాగంలాగా ఉండడం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.

గాడిద ఇలా శబ్దం చేయడం మీరు గతంలో ఎప్పుడూ వినలేదని అంటున్నారు.గాడిద మధురమైన శబ్దం విని నెటిజన్లు మంత్రముగ్ధులైపోతున్నారు.

వీడియోని ఇన్‌స్టాగ్రామ్( Instagram ) యూజర్ షేర్ చేయగా అది కాస్త వైరల్ గా మారింది.

ఈ వీడియోపై చాలా మంది యూజర్లు తమ రియాక్షన్స్ పంచుకుంటున్నారు.గాడిద చేసినది నిజంగా హృదయానికి హత్తుకునేలా ఉందని కొందరు అంటుంటే, మరికొందరు గాడిద కూడా పాడగలదని నిరూపించిందని కామెంట్లు పెడుతున్నారు.

కేజ్రీవాల్ అరెస్ట్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో ఈడీ కౌంటర్ ఫైల్..!