పార్టీలను చూడొద్దు రాజగోపాల్ రెడ్డికి ఓటెయ్యాలి

యాదాద్రి జిల్లా:బీజేపీ అభ్యర్థి,తన తమ్ముడు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి మద్దతుగా కాంగ్రేస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కోవర్ట్ ఆపరేషన్ చేస్తున్న ఆడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

కాంగ్రేస్ లో ఎంపీగా,స్టార్ క్యాంపెయినర్ ఉంటూ ప్రత్యర్థి పార్టీకి అనుకూలంగా గ్రౌండ్ వర్క్ చేస్తున్న ఫోన్ కాల్ లీక్ కావడం రాష్ట్ర రాజకీయాల్లో సంచలనంగా మారింది.

ఇంతకీ ఆ ఆడియోలో కోమటిరెడ్డి వెంకటరెడ్డి కాంగ్రేస్ పార్టీ మైనార్టీ నేటితో ఏం మాట్లాడారంటే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ఓటు వేయండి,ఈ దెబ్బతో పీసీసీ ప్రెసిడెంట్ నేనే అవుతా,రాష్ట్రంలో పాదయాత్ర చేస్తా పార్టీని అధికారంలోకి తెస్తా,మీరేం భయపడాల్సిన అవసరం లేదు.

ఏదైనా నేను చూసుకుంటాను.పార్టీలు చూడొద్దు,చచ్చినా బతికినా,ఏ కార్యక్రమమైనా రాజగోపాల్ రెడ్డి సహాయం చేస్తూ ఉంటారు.

ఈసారి అతనికి ఓటయ్యాలి.ఇది ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.

ఓ కాంగ్రెస్ మైనార్టీ లీడర్ తో ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మాట్లాడిన మాటలు కాంగ్రేస్ పార్టీలో ఎలాంటి పరిణామాలకు దారితీస్తుందోననే ఆసక్తి నెలకొంది.

కాంగ్రేస్ లో నన్ను ఒంటరిని చేశారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసిన మరునాడే ఈ ఆడియో లీక్ అవ్వడం యాదృచ్చికమా లేక దీని వెనక ఇంకేమైనా మర్మం దాగుందా అనేది రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారింది.

దీనితో ఆడియో ఉన్న మునుగోడుకు చెందిన జబ్బార్ మాట్లాడుతూ అది 2018 ఎన్నికల సమయంలో మాట్లాడిన పాత వాయిస్ అని,కావాలనే కుట్రతోనే ఇదంతా జరుగుతుందని అంటున్నారు.

సైబర్ క్రైం లో ఫిర్యాదు చేస్తానని చెబుతున్నారు.

దేవర 2 పై కీలక వ్యాఖ్యలు చేసిన నటుడు అజయ్… నా పాత్ర అలాంటిదంటూ?