వ్యవసాయ చట్టాలపై ఆందోళన.. రైతులకు మద్ధతిచ్చిన ఎన్ఆర్ఐలను కేంద్రం వేధిస్తోంది : పంజాబ్ మంత్రి

రెండేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దుల్లో నెలల తరబడి ఆందోళన నిర్వహించిన సంగతి తెలిసిందే.

తోటి రైతులు మరణిస్తున్నా, అనారోగ్యం బారినపడుతున్నా అన్నదాతలు ఏమాత్రం వెనక్కి తగ్గలేదు.దీంతో చివరికి ప్రధాని నరేంద్ర మోడీ( PM Narendra Modi ) దిగివచ్చారు.

మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకుంటున్నట్లుగా ప్రకటించారు.అయితే రైతులకు అండగా నిలిచిన ఎన్ఆర్ఐలు, ఇతర వ్యక్తులపై కేంద్రం కన్నెర్ర చేసింది.

వారిని బ్లాక్ లిస్ట్‌లో పెట్టడంతో పాటు దేశంలోకి అనుమతి ఇవ్వడం లేదు.ఈ నేపథ్యంలో పంజాబ్ ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కుల్‌దీప్ సింగ్ ధాలివాల్( Kuldeep Singh Dhaliwal ) స్పందించారు.

రైతుల ఆందోళనలో పాల్గొన్న పంజాబీ ఎన్ఆర్ఐలను( Punjabi NRIs ) కేంద్రం వేధింపులకు గురిచేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సదరు ఎన్ఆర్ఐలను బ్లాక్‌లిస్ట్‌లో వుంచుతున్నారని, మరికొందరిని దేశంలోకి రాకుండా అడ్డుకుంటున్నారని ధాలివాల్ ఆరోపించారు.

చండీగఢ్‌లోని మారియట్ హోటల్‌లో కేంద్ర విదేశాంగ శాఖ, పంజాబ్ ఎన్ఆర్ఐ విభాగం సంయుక్తంగా నిర్వహించిన ‘‘విదేశ్ సంపర్క్ ప్రోగ్రామ్’’లో( Videsh Sampark Programme ) ధాలివాల్ పాల్గొన్నారు.

కేంద్రం తన చర్యలను వెంటనే నిలిపివేయాలని. """/" / ఎన్ఆర్ఐలు తమ మాతృభూమిపై వున్న ప్రేమ, అభిమానాల కారణంగా రైతు ఉద్యమానికి( Farmers Protest ) మద్ధతుగా నిలిచారని పేర్కొన్నారు.

ఇదే సమయంలో మరో అంశాన్ని లేవనెత్తారు ధాలివాల్.విదేశాల్లో రాజకీయ ఆశ్రయం పొందుతున్న వారి కోసం కూడా కేంద్రం ఒక విధానాన్ని రూపొందించాలని డిమాండ్ చేశారు.

కాగా.రైతుల ఆందోళనగా నిలబడ్డ పంజాబీ వ్యాపారవేత్త దర్శన్ సింగ్ ధాలివాల్‌ను కేంద్రం ఇబ్బందులకు గురిచేసిన సంగతి తెలిసిందే.

"""/" / ఉద్యమం సమయంలో దర్శన్ సింగ్ ఢిల్లీ శివార్లలోని సింఘూ బోర్డర్‌లో లంగర్ నిర్వహించి రైతులకు భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు.

ఈ విషయం తెలుసుకున్న భారత ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది.ఈ నేపథ్యంలో దర్శన్ సింగ్ తన మేనకోడలి వివాహానికి హాజరయ్యేందుకు 2021 అక్టోబర్ 23న చికాగో-ఢిల్లీ విమానంలో భారత్‌కు వచ్చారు.

అయితే ఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలోని ఇమ్మిగ్రేషన్ అధికారులు దర్శన్ సింగ్‌ను అడ్డుకుని భారత్‌లో అడుగుపెట్టేందుకు అనుమతి నిరాకరించారు.

ఐదు గంటల హైడ్రామా తర్వాత ఆయనను అదే విమానంలో తిరిగి అమెరికాకు పంపించారు.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : ట్రంప్‌కు షాక్ , కమలా హారిస్‌కు ఊహించని మద్ధతు