ఈ చెట్లను ఇంట్లో పెంచితే దరిద్రమా?

చెట్లు ఇంటికి ఎంతో అందాన్ని ఇస్తాయి అలాగే మంచి ఆరోగ్యాన్ని ఇస్తాయి.అలాంటి చెట్లను ఇంటిలో ఎంతో అందంగా కనిపించాలని ఎంతో ఇష్టపడి పెంచుతూ ఉంటారు.

కానీ అన్ని చెట్లను ఇంటి కాంపౌండ్ లో పెంచకూడదు అని మీకు తెలుసా? ఎలాంటి చెట్లను పెంచడం వల్ల ఎలాంటి ఉపయోగాలు ఉంటాయో అని ఇక్కడ మనం తెలుసుకుందాం.

మన ఇంటి ఆవరణంలో ముళ్ల రేగు చెట్టు, బొప్పాయి చెట్టు ఉండకూడదు.అంటే ముళ్ళు కలిగినవి పాలుగారే చెట్లను ఇంటి ఆవరణంలో ఉంచుకోవడం వల్ల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది.

అలాగే తీగలు పాకె చెట్లు కూడా ఇంటి ఆవరణంలో పెంచకూడదు.ఇలాంటి చెట్లను పెంచడం ద్వారా ఆర్థిక సమస్యలను ఎదుర్కోవల్సి ఉంటుంది.

అలాగే కుటుంబంలో కలహాలు కలుగుతాయి.మన ఇంటి వాతావరణంలో ప్రతికూల పరిస్థితులను ఏర్పరుస్తుంది.

"""/"/ అలాగే అరటి చెట్లు కొందరికి శుభ ఫలితాలను కలిగిస్తాయి.మరికొందరికి వాటిని నాటిన వెంటనే ఆ ఇంటిలో అశుభం కలుగుతుంది.

అందువలన అరటి చెట్లు నాటడానికి కూడా ఎంతోమంది వెనుకాడుతుంటారు.అరటి చెట్టు చాలామందికి కలిసిరాదు.

ఎందుకనగా అరటి మొక్క ఒకసారి ఒకే గెలలను ఇచ్చిన వెంటనే అనంతరం దానిని నరికి వేస్తారు.

ఇది అశుభ ఫలితాలను కలిగిస్తుంది అని నమ్ముతారు.అరటి చెట్టు గుబురుగా వచ్చి దాని పిలకలు విడివిడిగా ఆవరణమంతా ఆక్రమించడం వల్ల శుభఫలితాన్ని ఇవ్వదు.

అలాగే ఇంటి ఆవరణంలో చింత చెట్లు, రావి చెట్టు, మర్రి చెట్టు లాంటివి పెంచకూడదు.

ఇవి ఎక్కువ ఆవరణంలో విస్తరించడమే కాకుండా, మన ఇంటి లోపలికి వచ్చేటువంటి పాజిటివ్ ఎనర్జీని రాకుండా అడ్డుకుంటాయి.

Chandrababu : ఏపీని కాపాడుకునేందుకే టీడీపీ పొత్తు..: చంద్రబాబు