ప్రత్యర్థుల మాటల ఉచ్చులో పడొద్దు..: ఎమ్మెల్యే కోటంరెడ్డి

నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ప్రజల ఆశీస్సులు తనకే ఉన్నాయని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అన్నారు.

అన్ని సర్వేల్లో తనకు అనుకూలంగా ఫలితాలు వస్తున్నాయని చెప్పారు.సర్వేలో వస్తున్న ఫలితాలను చూసి కొందరు కావాలనే కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.

సామాజిక మాధ్యమాల్లో అభ్యంతరకర పోస్టులతో రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు.ప్రత్యర్థుల మాటలకు రెచ్చిపోయి వారి ఉచ్చులో పడొద్దని కోటంరెడ్డి సూచించారు.

ప్రజాబలం ఉన్నంత వరకు ఇబ్బంది లేదని తెలిపారు.

రాష్ట్రపతి ముర్ము విందుకు వచ్చిన ఇండోనేషియన్లు ఏం చేశారో చూడండి.. వీడియో వైరల్..