మీలో ఈ ల‌క్ష‌ణాలు ఉంటే..ఉప్పు తగ్గించాల్సిందే!

ఉప్పు ఏది ఉన్నా లేకున్నా ప్ర‌తి ఒక్క‌రి వంటింట్లోనూ ఇది కామ‌న్‌గా ఉంటుంది.

మ‌నం నిత్యం తీసుకునే ఆహారాల్లో ఉప్పు ముఖ్య పాత్ర పోషిస్తుంది.స్వీట్స్ మిన‌హా ఇత‌ర ఏ వంట‌కాల్లో అయినా ఉప్పు ప‌డాల్సిందే.

లేదంటే ఆ వంట తిన‌డం పెద్ద న‌ర‌కంగా భావిస్తుంటారు.శ‌రీరానికి ఉప్పు ఎంతో అవ‌స‌రం.

అయితే కొంద‌రు శ‌రీరానికి కావాల్సిన‌ దానికంటే ఎక్కువ‌గా ఉప్పు తీసుకుంటుంటారు.ఇదే ప్రాణాల‌కు ముప్పుగా మారుతుంది.

ఆరోగ్యానికి ఎంత మేలు చేసిన‌ప్ప‌టికీ ఉప్పును అధికంగా తీసుకుంటే అనేక అనారోగ్య స‌మ‌స్య‌లు వ‌స్తాయ‌ని నిపుణులు కూడా చెబుతుంటారు.

/br> మోతాదు మించి వాడితే మాత్రం ఆరోగ్యం విషయంలో పలు లక్షణాలు కనిపిస్తాయి.మ‌రి ఆ ల‌క్ష‌ణాలు ఏంటీ అన్న‌ది ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

ఉప్పు అతిగా తీసుకునే వారిలో డీహైడ్రేష‌న్ స‌మ‌స్య ఎక్కువ‌గా క‌నిపిస్తుంటుంది.ఉప్పు వ‌ల్ల‌ శ‌రీరంలో నీటి శాతం త్వరగా అయిపోతుంది.

అందుకే త‌ర‌చూ డీహైడ్రేష‌న్ బారిన ప‌డే వారు ఖ‌చ్చితంగా ఉప్పు త‌గ్గించి తీసుకోవాల్సి ఉంటుంది.

"""/" / అలాగే ఉప్పు ఓవ‌ర్‌గా తీసుకుంటే క‌నిపించే మ‌రో ల‌క్ష‌ణం కాళ్ళ వాపులు.

ఈ కాళ్ళ వాపులు తీవ్ర నొప్పికి కూడా గురిచేస్తుంటారు.కాబ‌ట్టి, ఎవ‌రైతే కాళ్ళ వాపుల‌తో త‌ర‌చూ ఇబ్బంది ప‌డుతుంటారో అలాంటి వారు త‌ప్ప‌కుండా ఉప్పును త‌గ్గించి తినాలి.

"""/" / కొంద‌రు మూత్ర విసర్జనకు ఎక్కువ సార్లు వెళ్తుంటారు.మ‌ధుమేహం వ్యాధి గ్ర‌స్తుల్లో ఇది చాలా కామ‌న్‌.

కానీ, మ‌ధుమేహం లేక‌పోయినా మీలో ఈ ల‌క్ష‌ణం ఉంటే మీరు ఉప్పు తిన‌డం త‌గ్గించాలి.

ఎందుకంటే, ఉప్పు ప‌రిమితికి మించి తీసుకోవ‌డం వ‌ల్ల కూడా మూత్ర విసర్జనకు ఎక్కువ సార్లు వెళ్లాల్సి వ‌స్తుంది.

ఇక అధిక బీపీతో బాధ ప‌డినా, అధిక బ‌రువు ఉన్న వారు, త‌ర‌చూ త‌ల‌నొప్పితో స‌త‌మ‌త‌మ‌య్యే వారు కూడా ఉప్పును త‌గ్గించి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది.

పోలీస్‌స్టేషన్‌లో అల్లు అర్జున్‌పై కంప్లైంట్.. ఎందుకంటే?