వర్కవుట్స్ తర్వాత అస్సలు తినకూడని పండ్లు ఇవే?
TeluguStop.com
వర్కవుట్స్ చేయడం వల్ల వెయిట్ లాస్ అవ్వడం మాత్రమే కాదు ఎన్నో అనారోగ్య సమస్యలు దూరం అవుతాయి, ఫిట్‌గా ఉంటారు, శరీర రోగ నిరోధక శక్తి పెరుగుతుంది, మానసిక ప్రశాంతత కూడా లభిస్తుంది.
అందుకే ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరూ రోజులో ఎంతో కొంత సమయం వర్కవుట్స్ చేస్తున్నారు.
వర్కవుట్స్ చేసిన తర్వాత బాడీ తీవ్రంగా అలసి పోతుంది.ఈ సమయంలో శరీరానికి శక్తి ఎంతో అవసరం.
అందుకే వర్కవుట్స్ పూర్తి అయిన తర్వాత సరైన ఆహారం తీసుకోవాల్సి ఉంటుంది.ఈ క్రమంలోనే కొందరు పండ్లను తింటారు.
పండ్లు ఆరోగ్యానికి మంచివే.కానీ, వర్కవుట్స్ చేసిన తర్వాత కొన్ని కొన్ని పండ్లు తినడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతాయి.
మరి వర్కవుట్స్ చేసిన తర్వాత ఏ ఏ పండ్లు తినకూడదో ఇప్పుడు తెలుసుకుందాం.
చాలా మంది వ్యాయామాలు చేసిన తర్వాత ఎనర్జీ కోసం ఖర్జూర పండ్లు తింటుంటారు.
కానీ, ఖర్జూర పండ్లలో ఆరోగ్యానికి ఉపయోగపడే అనేక పోషకాలతో పాటు క్యాలరీలు కూడా అధికంగా ఉంటాయి.
అందువల్ల, వర్కవుట్స్ చేసిన వెంటనే ఖర్జూర పండ్లు తింటే కొవ్వు పెరిగే అవకాశాలు ఉంటాయి.
"""/" /
అలాగే వ్యాయామం చేసిన తర్వాత అరటి పండు తినే అలవాటు చాలా మందికి ఉంటుంది.
కానీ, ఇలా చేస్తే వర్కవుట్స్ చేసిన ఫలితం దక్కక పోగా శరీరంలో ఫ్యాట్ మరింత ఎక్కువ అవుతుంది.
అందుకే అరటి పండు వర్కవుట్స్ చేయడానికి అర గంట ముందు తినాలి.మామిడి పండ్లలో కూడా క్యాలరీలు చాలా ఎక్కువగా ఉంటాయి.
అందుకే వ్యాయామం చేసిన తర్వాత మామిడి పండు తినకూడదని నిపుణులు చెబుతున్నారు.కాబట్టి ఈ పండ్లు కాకుండా.
యాపిల్, ఆరెంజ్, దానిమ్మ, పుచ్చకాయ, బెర్రీస్, గ్రేప్స్, కివి వంటి పండ్లు తీసుకోవచ్చు.
లేదా ప్రోటీన్ షేక్స్ తాగొచ్చు.
మొండి దగ్గును సైతం మడతెట్టేసే మ్యాజికల్ డ్రింక్ ఇది..!