నా ట్రస్ట్ కు ఎవరు విరాళం ఇవ్వద్దు… సంచలన వ్యాఖ్యలు చేసిన రాఘవ లారెన్స్!

సినీ ఇండస్ట్రీలో కొరియోగ్రాఫర్ గాను, నటుడిగా డైరెక్టర్ గా పని చేస్తూ ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో రాఘవ లారెన్స్ ( Raghava Lawrence )ఒకరు.

ఈయనకు తెలుగు తమిళ భాషలలో విపరీతమైన ఫాన్ ఫాలోయింగ్ ఉంది.ఈ విధంగా పలు భాషా చిత్రాలలో నటిస్తూ ఎంతో బిజీగా ఉన్నటువంటి లారెన్స్ మరో వైపు సామాజిక సేవా కార్యక్రమాలలో కూడా చాలా చురుగ్గా పాల్గొన్నారు.

ఈయన 60 మంది చిన్నారులను చేరదీసి వారికి చదువులు చెప్పించడమే కాకుండా వారి అవసరాలన్నింటినీ కూడా చూసుకుంటున్న సంగతి తెలిసిందే.

ఇలా ట్రస్ట్ ప్రారంభించినటువంటి లారెన్స్ చాలా మందికి ఓపెన్ హార్ట్ సర్జరీలు కూడా చేయించి ఎంతో మందికి పునర్జన్మ కూడా అందించారు.

"""/" / ఈ విధంగా రాఘవ లారెన్స్ తన ట్రస్టు( Trust )ద్వారా ఎంతో మంది చిన్నారులకు అండగా నిలిచారు.

అయితే గత కొద్దిరోజుల క్రితం ఈయన తన ట్రస్ట్ కి ఎవరు విరాళం ఇవ్వద్దు అంటూ సోషల్ మీడియా వేదికగా చేసినటువంటి ట్వీట్ సంచలనగా మారింది.

అయితే ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తూ కామెంట్లు చేశారు.అయితే తాజాగా లారెన్స్ ఈ విషయం గురించి మాట్లాడుతూ తాను ట్రస్ట్ కు ఎందుకు విరాళాలు ఇవ్వద్దని ఎందుకు చెప్పాల్సి వచ్చిందన్న విషయం గురించి కూడా క్లారిటీ ఇచ్చారు.

"""/" / తాను ట్రస్ట్ ప్రారంభించిన సమయంలో రెండు సంవత్సరాలకు ఒక సినిమా మాత్రమే చేసేవాడిని ట్రస్ట్ ను నడిపించడానికి అవసరమయ్యే డబ్బు తన వద్ద లేకపోవడంతో వీలైన వారు సహాయం చేయాలని కోరాను అయితే ప్రస్తుతం నేను సంవత్సరానికి మూడు సినిమాలు చేస్తున్నాను.

డబ్బు కూడా బాగానే సంపాదిస్తున్నాను అలాంటి సమయంలో ఇతరుల సహాయం లేకుండా ట్రస్ట్ కు అన్ని తానే ముందుకు నడిపించాలని భావించాను ఇంతకుమించి మరే కారణంతోను తాను విరాళాలు ఇవ్వద్దు అంటూ చెప్పలేదని ఈ సందర్భంగా లారెన్స్ చేసినటువంటి కామెంట్స్( Comments ) ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.

అలా తోడుండే భాగస్వామి కావాలి.. హీరోయిన్ రష్మిక సంచలన వ్యాఖ్యలు వైరల్!