ఖాళీ కడుపుతో ప‌డుకుంటే ఆ తిప్ప‌లు త‌ప్ప‌వు..జాగ్ర‌త్త‌!

సాధార‌ణంగా మ‌నం ఎదుర్కొనే అనారోగ్య స‌మ‌స్య‌లు దాదాపు మ‌న జీవ‌న శైలిలో ఏర్ప‌డిన మార్పుల వ‌ల్లే వ‌స్తుంటాయి.

ఈ విషయం దాదాపు అంద‌రికీ తెలుసు.కానీ, పెద్ద‌గా ప‌ట్టించుకోరు.

ముఖ్యంగా కొంద‌రు తెలిసో, తెలియ‌కో ఖాళీ క‌డుపుతో కొన్ని కొన్ని పొర‌పాట్లు చేస్తుంటారు.

అ పొర‌పాట్లే అనేక ముప్పుల‌ను తెచ్చి పెడుతుంటారు.అస‌లు ఇంత‌కీ ఖాళీ క‌డుపుతో చేయ‌కూడ‌ని పొర‌పాట్లు ఏంటీ.

? ఆ పొర‌పాట్లు వ‌ల్ల వ‌చ్చే న‌ష్టాలు ఏంటీ.? అన్న విష‌యాల‌ను లేట్ చేయ‌కుండా ఇప్పుడు తెలుసుకుందాం.

చాలా మంది ఖాళీ క‌డుపుతో ప‌డుకుంటారు.ఇటు వంటి సంద‌ర్భాలు ఎక్కువ రాత్రి వేళ‌లో జ‌రుగుతుంటాయి.

ఏదో ఒక కార‌ణం చేత కొంద‌రు ఏం తిన‌కుండా ఖాళీ క‌డుపుతో నిద్ర పోతుంటారు.

కానీ, ఇలా చేయ‌డం ఆరోగ్యానికి ఏ మాత్రం మంచిద‌ని కాద‌ని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

ఖాళీ క‌డుపుతో నిద్ర పోతే.వెయిట్ గెయిన్ అయ్యే అకాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.

మ‌రియు జీర్ణ వ్య‌వ‌స్థ ప‌ని తీరు సైతం త‌గ్గి పోతుంద‌ని అంటున్నారు.అలాగే కొంద‌రు ఉద‌యం లేవ‌గానే ఖాళీ క‌డుపుతోనే చెమ‌ట‌లు చిందేలా వ్యాయామాలు చేస్తుంటారు.

ఇలా చేస్తే వ్యాయామాలు అయ్యే స‌మ‌యానికి తీవ్ర‌మైన నీర‌సం, అల‌స‌ట, త‌ల నొప్పి వంటి స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

అందుకే వ్యాయామం చేయ‌డానికి ముందు ఏదైనా పండు లేదా క‌నీసం రెండు గ్లాస్ ల  వాట‌ర్ అయినా తీసుకోవాలి.

"""/" / ఇక ఖాళీ క‌డుపులో టీ, కాఫీలు, సోడాలు వంటివి  తీసుకోరాదు.

టమాటాలు, చిల‌క‌డ‌ దుంప‌లు, మసాలా ద‌ట్టించిన ఆహారాలు, పుల్ల‌టి పండ్లు, ప‌చ్చి కూర‌గాయ‌లు వంటి వాటికి కూడా దూరంగా ఉంటాయి.

ఎందుకుంటే, ఖాళీ క‌డుపుతో వీటిని తీసుకుంటే గ్యాస్‌, ఎసిడిటీ, క‌డుపు ఉబ్బ‌రం వంటి స‌మ‌స్య‌లు త‌లెత్తే అవ‌కాశాలు చాలా అధికంగా ఉంటాయి.

కన్నప్ప లో ప్రభాస్ ఎంత సేపు కనిపిస్తాడు..?