రన్నింగ్ చేసేటప్పుడు అస్సలు చేయకూడని తప్పులు ఇవే!
TeluguStop.com
ఆరోగ్యంగా, ఫిట్‌గా ఉండాలనుకునే వారు ఖచ్చితంగా ప్రతి రోజు రన్నింగ్ చేయడం అలవాటు చేసుకుంటుంటారు.
రన్నింగ్ చేయడం వల్ల కేవలం బరువు తగ్గడమే కాదు.ఒత్తిడి దూరం అవుతుంది, శరీర రోగ నిరోధక శక్తి బలపడుతుంది, గుండె జబ్బులు వచ్చే రిస్క్ తగ్గు ముఖం పడుతుంది, జీర్ణ వ్యవస్థ పని తీరు మెరుగు పడుతుంది, మెదడు షార్ప్‌గా మారుతుంది, మంచి నిద్ర పడుతుంది ఇలా చాలా ప్రయోజనాలు పొందొచ్చు.
ఆరోగ్యానికి ఎంతో మేలు చేసినప్పటికీ.రన్నింగ్ చేసేటప్పుడు పొరపాటున కూడా కొన్ని తప్పులను చేయకూడదు.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.రన్నింగ్ ఆరోగ్యానికి మంచేదే.
అయినప్పటికీ మాత్రం చేయకూడదు.అతిగా రన్నింగ్ చేయడం వల్ల పలు అనారోగ్య సమస్యలతో పాటు పరిగెత్తడంపై క్రమంగా విరక్తి కూడా పుడుతుంది.
అలాగే చాలా మంది ఏ దుస్తులు పడితే ఆ దుస్తులు వేసుకుని రన్నింగ్ చేస్తుంటారు.
దీని వల్ల అనేక చర్మ సమస్యలతో పాటు ఇరిటేషన్ కూడా వస్తుంది.అందుకే రన్నింగ్ చేసేటప్పుడు చెమట పీల్చే బట్టలను వేసుకుంటే మంచిది.
"""/" /
రన్నింగ్ చేసే సమయంలో చెమట రూపంలో ఒంట్లో నీరంతా ఆవిరైపోతుంది.
అందువల్ల, రన్నింగ్ పూర్తి అయిన తర్వాత తప్పకుండా నీరు తీసుకోవాలి.కానీ, ఈ విషయంలో చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటారు.
దాంతో డీహైడ్రైషన్ మరియు ఇతర అనారోగ్య సమస్యల బారిన పడుతుంటారు.ఇక రన్నింగ్ చేసే వారిలో చాలా మంది.
వేసుకునే షూస్ విషయంలో అస్సలు జాగ్రత్త వహించరు.కానీ, సరైన షూస్ ధరించకుండా రన్నింగ్ చేస్తే పాదాలకి గాయాలయ్యే ప్రమాదం ఉంటుంది.
అలాగే తెలిసో, తెలియకో ఖాళీ కడుపుతోనే చాలా మంది రన్నింగ్ చేస్తుంటారు.ఇలా చేయడం చాలా పొరపాటు.
రన్నింగ్ చేయడానికి గంట లేదా రెండు గంటల ముందు కార్బో హైడ్రేట్స్ ఎక్కువగా, ఫ్యాట్ తక్కువగా ఉండే స్నాక్ తీసుకుంటే మంచిది.
ఇక రన్నింగ్ తర్వాత గ్రీన్ టీ, ప్రోటీన్ షేక్స్ వంటివి తీసుకోవాలి..
భర్త అఫైర్ పెట్టుకున్నాడని అందరి ముందే పరువు తీసేసిన భార్య.. వీడియో వైరల్..