ఇల్లు శుభ్రం చేసేటప్పుడు అసలు.. ఈ పొరపాటులను చేయకూడదు..!

ఇంటిని శుభ్రం చేసేటప్పుడు( Cleaning Home ) ఈ పొరపాట్లను అస్సలు చేయకూడదు.

ఇంటిని శుభ్రం చేసేటప్పుడు చాలా మంది కొన్ని రకాల పొరపాట్లను చేస్తూ ఉంటారు.

ఇల్లు శుభ్రంగా ఉంది కదా అని భావిస్తూ ఉంటారు.కానీ ఎక్కువమంది ఈ తప్పులు చేస్తారు.

మరి అవెంటనేది ఇప్పుడు తెలుసుకుందాం.చాలామంది ఇంటిని క్లీన్ చేసేటప్పుడు ఇంటి ఫ్లోర్ని తుడుస్తారు.

కానీ గోడ ను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. """/" / గోడలకి( Walls ) కూడా చాలా దుమ్ము ఉంటుంది.

గోడల్ని కూడా కచ్చితంగా శుభ్రం చేస్తూ ఉండాలి.గోడలను కనీసం వారానికి ఒక్కసారైనా శుభ్రం చేసుకోవాలి.

వాటి పై దుమ్ము, ధూళి ఎక్కువగా ఉంటాయి.కిచెన్లో అయితే జిడ్డు కూడా ఉంటుంది.

బ్యాక్టీరియా వంటివి చేరుతాయి.కాబట్టి కచ్చితంగా గోడల్ని శుభ్రం చేయాలి.

అదేవిధంగా కిటికీలను( Windows ) కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.కిటికీ లో కూడా చాలా దుమ్ము ఉంటుంది.

నెలకి ఒకసారి కిటికీలని శుభ్రం చేసుకోవాలి. """/" / అలాగే బెడ్ పై పరిచిన దుప్పట్లు వాష్ చేస్తూ ఉండాలి.

కానీ చాలామంది పరుపు పై( Mattress ) పేరుకుపోయిన దుమ్ముని మాత్రం శుభ్రం చేయరు.

దీన్ని కూడా రెండు నెలలకు ఒకసారి శుభ్రం చేస్తూ ఉండాలి.బేకింగ్ సోడానీ మీ పరుపు మీద చల్లి కాసేపు వదిలేసి వ్యాక్యూమ్ క్లీనర్ తో క్లీన్ చేసుకుంటే సులభంగా క్లీన్ అవుతుంది.

లాప్టాప్ ని కూడా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉండాలి.లాప్టాప్ మీద కూడా చాలా దుమ్ము ఉంటుంది.

నిజానికి టాయిలెట్ సీటుకి ఉండే దానికంటే ఎక్కువ బ్యాక్టీరియా లాప్టాప్ మీదే ఉంటుంది.

అందుకే డోర్ మాట్స్, కిచెన్ టవల్స్ వంటి వాటిని కూడా ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ ఉండాలి.