దీపావళిలో ఈ చిన్న చిన్న పొరపాట్లు అస్సలు చేయకూడదు...

మన దేశంలో జరుపుకునే చాలా పండుగలకి ఒక్కొక్క ప్రాంతానికి బట్టి ఒకొక్క పేరు ఉంది.

కానీ దీపావళి పండుగకు మాత్రం ఏ ప్రాంతంలో అయినా దీపావళి అనే పేరు మాత్రమే ఉంది.

మన దేశంలోని చాలామంది ప్రజలు ఒక్కొక్క పండుగ ఒక్కొక్క రకంగా పూజలు, ఉపవాసాలు చేస్తూ ఉంటారు.

అలా చేసేటప్పుడు కొన్ని చిన్న చిన్న పొరపాట్లను కూడా చేస్తూ ఉంటారు.అసలు దీపావళి పండుగ అంటేనే దీపాల పండుగ అని అర్థం.

అజ్ఞానం అనే చీకటిని తొలగించి జ్ఞానం అనే వెలుగుని మన జీవితంలో నింపడమే దీపావళి ముఖ్య అర్థం.

"""/"/ సాధారణంగా అమావాస్య రోజు రాత్రి చీకటి మయంగా ఉంటుంది కాబట్టి ఆ చీకట్లను పారద్రోలి మనలో ఉండే అజ్ఞానాన్ని తరిమికొట్టడమే ఈ పండుగ ముఖ్య అర్థం.

దీపావళి పండుగ రోజు లక్ష్మీదేవి వైకుంఠం నుండి భూమి పైకి వస్తుందని అందుకే ఆమెకు దీపాలతో స్వాగతం పలుకుతారని వేద పండితులు చెబుతూ ఉంటారు.

అందుకోసమే దీపాలు వెలిగించేటప్పుడు చిన్న చిన్న పొరపాట్లు చేయకూడదు.దీపం వెలిగించేటప్పడు ఈ మంత్రాన్ని చదువుతూ వెలిగించాలి.

దీపం సర్వతమోపహం దీపో హరతుమే పాపం దీపలక్ష్మీ నమోస్తుతే.అంటూ దీపాన్ని వెలిగిస్తే ఆ ఇంట్లో సుఖసంతోషాలు ఉంటాయి.

దీపారాధన చేయటానికి వెండి, ఇత్తడి ప్రమిదలకు కన్నా మట్టి పాత్రలే మంచిది.ఎందుకంటే లోహం వెడక్కడంతో భూమి వేడెక్కే అవకాశం ఉంది.

మట్టి ప్రమిదలైతే వేడిని గ్రహిస్తాయి కాబట్టి వీటిని ఉపయోగించడమే మంచిది.దీపంలో అందం కోసం అంటూ ఎన్ని వత్తులంటే అన్ని వెయ్యరాదు.

మూడు వత్తులైనా, రెండు వత్తులైనా కలపి దీపం వెలిగించడం మంచిది.దీపం నువ్వుల నూనె, ఆవునెయ్యిని వినియోగించడం చాలా మంచిది.

త్రిలోకాధిపత్యంతో పాటు సర్వ సంపదలు కోల్పోయిన దేవేంద్రుడు దీపావళి రోజు దీపారాధన చేయడం వల్ల మళ్లీ తిరిగి అన్నీ పొందాడు.

అందుకే దీపావళి రోజు దీపాలు వెలిగించడం ఆ కుటుంబ సభ్యులకు ఎంతో మంచిది.

జపాన్ దేశంలో కూడా దేవర మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిందా.. అసలేమైందంటే?