CM Revanth Reddy : కేంద్రం ఉత్తర భారతం, దక్షిణ భారతం అంటూ తేడా చూపొద్దు..: సీఎం రేవంత్

ములుగు జిల్లాలో మేడారం మహాజాతర( Medaram Jatara )కు సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు.

ఈ క్రమంలో వనదేవతలను దర్శించుకున్న ఆయన మొక్కులు చెల్లించుకున్నారు.అనంతరం సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) మాట్లాడుతూ వనదేవతలను దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు.

అమ్మవార్లను దర్శించుకుని నాలుగు కోట్ల రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుకున్నట్లు తెలిపారు.

"""/" / ఏ ముఖ్యమైన కార్యక్రమం చేపట్టాలన్నా సమ్మక్క సారలమ్మ( Sammakka Saralamm )ల ఆశీర్వాదం తీసుకుంటామని చెప్పారు.

వనదేవతల ఆశీర్వాదంతోనే అధికారంలోకి వచ్చామన్న సీఎం రేవంత్ రెడ్డి ఆరు వేల బస్సులను మేడారం జాతరకు వినియోగించామని తెలిపారు.

కోటి 50 లక్షల మంది భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగలేదని చెప్పారు.కేంద్రం ఉత్తర భారతం, దక్షిణ భారతం అంటూ తేడా చూపొద్దన్నారు.

అయోధ్యలో రాముడిని ఎలా దర్శించుకుంటున్నారో ప్రధాని, అమిత్ షా మేడారం వచ్చి అమ్మలను దర్శించుకోవాలని కోరారు.

చిరంజీవి ఫ్లాప్ మూవీని ఆ హీరో మనవడు ఏకంగా 1000 సార్లు చూశాడట.. ఏమైందంటే?