చెత్తను కాలువల్లో వేసి ఇబ్బందులు సృష్టించుకోవద్దు…!

సూర్యాపేట జిల్లా:ప్రజలు తమ ఇండ్లల్లో ఉత్పత్తి అయ్యే చెత్తను మురికి కాలువల్లో వేసి,నీళ్లు ఆగేలా చేసుకుని ఇబ్బందులు పడొద్దని పేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాళ్ళ అన్నపూర్ణ శ్రీనివాస్ అన్నారు.

రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్( Minister KTR ) ఆదేశాల మేరకు రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి( Guntakandla Jagadish Reddy ) సహకారంతో పట్టణంలోని 29వ వార్డులో ఏర్పాటు చేసిన ప్రత్యేక పారిశుద్య కార్యక్రమంలో ఆమె పాల్గొని మాట్లాడుతూ ప్రజలు కాలువల్లో చెత్తను వేయడంతో కాలువల్లో మురుగునీరు నిలిచిపోయి అందరూ ఇబ్బందులు పడే అవకాశం ఉందన్నారు.

తమ ఇంట్లో ఉత్పత్తి అయ్యే చెత్తను,ఇండ్లలో మిగిలిన ఆహారాన్ని తడి చెత్తగా మున్సిపల్ ట్రాక్టర్ కు అందించాలన్నారు.

పొడి చెత్తను దాచి వార్డులో ఏర్పాటు చేసే ఆర్ఆర్ఆర్ కేంద్రాల్లో కిలో రూ.

5 లకు విక్రయించాలని చెప్పారు.పట్టణాభివృద్ధికి అనుగుణంగా పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు.

పట్టణ ప్రజలంతా పొడి చెత్తను రోడ్ల వెంట వేయకుండా దాచి పెట్టుకుని విక్రయించి ఆదాయం పొందాలని సూచించారు.

ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.అనంతరం వార్డులో రోడ్లను శుభ్రం చేసి కాలువల్లో పూడికతీత పనులను చేపట్టారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పి.రామానుజుల రెడ్డి,29 వ వార్డు కౌన్సిలర్ అనంతుల యాదగిరి,ఈఈ జికెడి ప్రసాద్,శానిటరీ ఇన్స్పెక్టర్ సారగండ్ల శ్రీనివాస్, బిఆర్ఎస్ జిల్లా నాయకులు రాపర్తి శ్రీనివాస్ గౌడ్,వార్డు అధ్యక్షుడు అనంతుల నాగరాజు,మెప్మా సిబ్బంది నళిని,గోపగాని సందీప్, గోపగాని నాగరాజు,జవాన్ వేణు తదితరులు పాల్గొన్నారు.

పచ్చిమిర్చిని రోజూ తింటున్నారా.. లేకుంటే ఈ విషయాలు తెలుసుకోండి!