శనివారం ఈ వస్తువులు కొంటున్నారా.. అయితే జాగ్రత్త!

శనివారంకు శనీశ్వరుడు అధిపతి.శనీశ్వరుడిని శనివారం దర్శించుకున్న శుభ ఫలితాలు కలుగుతాయి.

చాలామందిలో శనీశ్వరుని పూజించడం వల్ల శని కలుగుతుందని భావన ఉంది.అది కేవలం అపోహ మాత్రమే.

శనివారం శనీశ్వరునికి పూజించడం వల్ల ఏళ్ళ నాటి శని వదులుతుంది.శనివారం కొన్ని వస్తువులను మనం ఇంటికి తీసుకు రాకూడదు.

మరి ఎలాంటి వస్తువులను కొనకూడదు? కొనడం వల్ల కలిగే నష్టాలను తెలుసుకుందాం.శనివారం ఇనుప తో తయారైన వస్తువులను లేదా ఇనుము కొనరాదు.

అలా కొనడం ద్వారా వ్యాపారంలో ఎటువంటి అభివృద్ధి జరగదు.అంతే కాకుండా పెద్ద ఎత్తున నష్టం వాటిల్లుతుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు.

"""/" / శనివారం నువ్వులను, నువ్వుల నూనెను తీసుకొని రాకూడదు.అలా తీసుకు రావడం వల్ల సాక్షాత్తు శనీశ్వరుని ఇంటికి ఆహ్వానించినట్లు.

ఎందుకంటే నువ్వులు శని దేవునికి అత్యంత ప్రీతికరమైన ధాన్యం కాబట్టి.శనివారం ఉప్పును దానం చేయకూడదు అలా చేయడం వల్ల లక్ష్మీదేవిని దానం చేసినట్లుగా పురోహితులు చెబుతున్నారు.

అలాగే శనివారం రోజున ఆవాలతో చేసిన వంటలు కానీ, ఆవు నూనె కాని వాడకూడదు.

శనివారం నల్లని దుస్తులు, నలుపు గాజులు, నలుపు రంగు బూట్లు మొదలైనవి కొనరాదు.

అలాగే కత్తెరను కూడా శనివారం రోజున కొనరాదు.అలా కొనడం ద్వారా అధిక ఒత్తిడులకు లోనవుతారు.

చీపురును శనివారం కొనడం ద్వారా మన ఇంట్లోని సంపద మొత్తం ఖర్చు అవుతుందని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.

అలాగే బ్లూ ఇంకు శనివారం కొనకూడదు.గురువారం రోజున బ్లూ ఇంకు కనుగొనడం ద్వారా విద్యారంగంలో రాణిస్తారు.

శనివారం నల్ల రంగు దుస్తులు ధరించడం వల్ల శనీశ్వరుని ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది.

శనివారం నల్ల రంగు దుస్తులు ధరించకూడదని ఆధ్యాత్మిక పండితులు చెబుతున్నారు.శనివారం శనీశ్వరునికి నువ్వుల నూనెతో అభిషేకం చేసి, నువ్వులను సమర్పించి, నల్లని వస్త్రాన్ని శనీశ్వరుని మెడలో మాలగా అలంకరించి పూజించడం ద్వారా అష్ట దరిద్రాలు తొలగి పోయి సుఖశాంతులు, సిరి సంపదలు కలుగుతాయి.

గోడిచర్ల నుంచి సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర..!