శనివారం రోజు ఇలాంటి వస్తువులను కొనడం మంచిది కాదా..?
TeluguStop.com
మన దేశంలో చాలామంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని నమ్ముతారు.ఇంటి వాస్తు సరిగ్గా లేకుండా ఉంటే ఆ ఇంటికి కొన్ని సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
కాబట్టి ప్రతి ఒక్కరూ కచ్చితంగా వారి ఇంటిని వాస్తు ప్రకారం ఉండేలాగా చూసుకుంటున్నారు.
వాస్తు శాస్త్రంలో శనివారానికి( Saturday ) ఎక్కువగా ప్రాధాన్యత ఉంది.ఆ రోజున కొన్ని వస్తువులను కొన్నవారికి సమస్యలు తప్పవని ఈ వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చాలామంది ప్రజలు వాస్తు సరిగా లేదంటే ఎంత ఖర్చు చేసిన సరే వాస్తును సరి చేసుకోవడానికి వెనుకాడరు.
మరికొంతమంది వాస్తు సరిగ్గా లేకపోతే ఒక్క అడుగు కూడా ముందుకు వేయరు.కొంత మంది కొన్ని రకాల వస్తువులను శనివారం కొనడం మంచిది కాదని చాలా మంది వాస్తు పండితులు చెబుతూ ఉంటారు.
శనివారం నాడు కరుణించమని శని దేవుడికి( Shanidev ) పూజలు చేస్తూ ఉంటారు.
అటువంటి సమయంలో కొత్త వస్తువులను కొనడం మంచిది కాదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆ రోజు కొన్న వస్తువులను ఇంటికి తీసుకొస్తే అరిష్టమని, ఇంట్లో సంపద, ఆరోగ్యం బయటకు వెళ్లిపోతాయని హెచ్చరిస్తున్నారు.
వాస్తు ప్రకారం శనివారం రోజు ఎటువంటి వస్తువులు కొనకూడదో ఇప్పుడు చూద్దాం. """/" /
ఇనుము వ్యాపారస్తులు కూడా శనివారం రోజు ఇనుప వస్తువులను కొనడం కానీ, అమ్మడం కానీ చేయకూడదు.
ఇంకా చెప్పాలంటే వాహనాలను( Vehicles ) కూడా శనివారం రోజు కొనుగోలు చేయకూడదని వాస్తు నిపుణులు హెచ్చరిస్తున్నారు.
శనివారం రోజు ఉప్పును( Salt ) అస్సలు కొనకూడదు.ఆ రోజు ఉప్పును కొనడం వల్ల ఆ ఇంటికి అరిష్టాలు జరుగుతాయని వాస్తు పండితులు చెబుతున్నారు.
"""/" /
ఆవ నూనెను( Mustard Oil ) కూడా శనివారం రోజు ఇంటికి తీసుకురాకూడదు.
అంతేకాకుండా కలపతో తయారు చేసిన వస్తువులను శనివారం రోజు ఎట్టి పరిస్థితుల్లో ఇంటికి తీసుకురావద్దని హెచ్చరిస్తున్నారు.
ఇలా చేయడం వలన అనేక అశుభాలు జరిగే అవకాశం ఉంది.నల్లటి షూస్, నల్లటి బట్టలు ఇలా నలుపు రంగు వస్తువులను శనివారం రోజు ఇంటికి తీసుకురావడం వలన వాటితో పాటు నెగటివ్ ఎనర్జీ కూడా ఇంటిలోకి వస్తుంది.
వైరల్: ఇటువంటి సాహసం మీ వల్ల కానేకాదు సుమీ!