తప్పుడు కథనాలు నమ్మొద్దు..: నటుడు శ్రీకాంత్

బెంగళూరు రేవ్ పార్టీ వ్యవహారంపై సినీ నటుడు శ్రీకాంత్( Srikanth ) స్పందించారు.

తాను రేవ్ పార్టీలు, పబ్ లకు వెళ్లనని తెలిపారు.ఈ క్రమంలోనే బెంగళూరు ( Bangalore )శివారు ప్రాంతంలో నిర్వహించిన రేవ్ పార్టీ( Rave Party )తో తనకు ఎలాంటి సంబంధం లేదని నటుడు శ్రీకాంత్ స్పష్టం చేశారు.

రేవ్ పార్టీలో పట్టుబడిన వ్యక్తి కొంచెం తనలాగే ఉన్నారని పేర్కొన్నారు.తాను హైదరాబాద్ లోని తన నివాసంలోనే ఉన్నానని తెలిపారు.

ఈ క్రమంలో తనపై వస్తున్న తప్పుడు కథనాలను నమ్మొద్దని సూచించారు.

పబ్లిసిటీ లేకుండా సినీ సెలబ్రిటీస్‌ చేసిన మంచి పనులు.. ఏంటంటే..??