కాంగ్రెస్,బీజేపీ మోసపూరిత మాటలు నమ్మొద్దు:మాజీ ట్రైకార్ చైర్మన్
TeluguStop.com
నల్లగొండ జిల్లా:కాంగ్రెస్,బీజేపీ మోసపూరిత మాటలు నమ్మొద్దని మాజీ ట్రైకార్ చైర్మన్ రామచందర్ నాయక్( Tricar Chairman Ramchander Naik ) ప్రజలకు సూచించారు.
బుధవారం నల్లగొండ జిల్లా త్రిపురారం మండల పరిధిలోని పెద్దదేవులపల్లి,కంపసాగర్, దుగ్గేపల్లీ,కంపలపల్లి,కామారెడ్డిగూడెం తదితర గ్రామాల్లో పర్యటించి నల్గొండ బీఆర్ఎస్( BRS ) ఎంపీ అభ్యర్థి కంచర్ల కృష్ణారెడ్డి కి మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ప్రజలనుద్దేశించి ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్( Congress) అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కరెంటు సరఫరా సరిగా లేదని,6 గ్యారంటీల పథకాలు 100 రోజుల్లో అమలు పరుస్తామని మాయమాటలు చెప్పి ఇప్పటికీ అమలు చేయలేదని విమర్శించారు.
దీంతో ప్రజల్లో కాంగ్రెస్ పార్టీ విశ్వాసం కోల్పోయిందన్నారు.కాంగ్రెస్,బీజేపీ అబద్ధపు మాటలతో ఎన్నికల్లో గెలవాలని చూస్తున్నారని,వారి మాటలను నమ్మవద్దని సూచించారు.
నల్గొండ పార్లమెంట్ ( Nalgonda Parliament ) ఎంపీ అభ్యర్థికి ప్రజల మద్దతు పూర్తిగా ఉందని,ఆయన విజయం ఖాయమన్నారు.
ఏ గ్రామానికి వెళ్లినా బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుందన్నారు.
ఈ కార్యక్రమంలో నిడమానూరు మాజీ మార్కెట్ చైర్మన్ కామెర్ల జానయ్య,త్రిపురారం గ్రామ తాజా మాజీ సర్పంచ్ అనుముల శ్రీనివాస్ రెడ్డి, పెద్దదేవులపల్లి సహకార సంఘం మాజీ చైర్మన్ గుండెబోయిన కోటేష్ , పెద్దదేవులపల్లి సహకార సంఘం ఉపాధ్యక్షుడు గుండెబోయిన వెంకన్న, వెంకటచారి,శ్యామ్ సుందర్ రెడ్డి,గ్రామశాఖల అధ్యక్షులు, అనుబంధ సంఘాల నాయకులు,కార్యకర్తలు, మండల నాయకులు పాల్గొన్నారు.
వైరల్ వీడియో: సిక్సర్ వెళ్లిన బంతిని తీసుకుని పారిపోయిన అభిమాని