అధైర్య పడకండి అండగా ఉంటాం.. జిల్లా బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య

రాజన్న సిరిసిల్ల జిల్లా :అధైర్య పడకండి మీకు అండగా ఉంటామని ఎల్లారెడ్డిపేట ఎంపిపి పిల్లి రేణుక కిషన్, జెడ్ పి టి సి సభ్యులు చీటీ లక్ష్మణరావు , బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య అన్నారు.

ఎల్లారెడ్డిపేట మండలంలో మంగళవారం కురిసిన భారీ వడగళ్ళ వానకు నష్టపోయిన పంట పొలాలను ఎల్లారెడ్డిపేట ఎంపీపీ పిల్లి రేణుక కిషన్, జెడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు, జిల్లా బిఆర్ ఎస్ పార్టీ అధ్యక్షులు తోట ఆగయ్య లు బుధవారం పరిశీలించారు.

వడ గళ్ళ వానకు నష్టపోయిన పంట పొలాలను పరిశీలించి రైతుల వివరాల నివేదికలను తయారు చేసి జిల్లా కలెక్టర్ కు అందజేయాలని ఎంపీపీ పిల్లి రేణుక కిషన్ , జడ్పిటిసి సభ్యులు చీటీ లక్ష్మణరావు, బిఆర్ ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు తోట ఆగయ్య వ్యవసాయ అధికారి భూమి రెడ్డిని ఆదేశించారు.

ఈ సందర్భంగా జెడ్పిటిసి చీటీ లక్ష్మణరావు మాట్లాడుతూ వాతావరణం అనుకూలంగా లేనందున కోతకు వచ్చిన వరి పంటలను రైతులు జాప్యం చేయకుండా వరియంత్రాలతో కోయించాలని రైతులకు సూచన చేశారు.

బుధవారం గుంటపల్లి చెరువు తండా లో పంటల పరీశీలనకు వెళ్లగా అక్కడి గిరిజనులు ఆరుగాలం కష్టపడి పండించిన చేతికి వచ్చిన వరి ధాన్యం రాళ్ళ వర్షానికి క్షణం లో సర్వనాశనం అయ్యాయని బోరున విలపించారు.

తమను ప్రభుత్వ పరంగా నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని వారు కాళ్ళావేళ్ళా పడి ప్రాధేయపడ్డారు.

రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తో నష్టం గురించి మాట్లాడి నష్టపరిహారం ఇప్పించడానికి ప్రయత్నిస్తమన్నారు.

రైస్ మిల్లర్లు కూడా వరి ధాన్యం కేంద్రాలనుంచి వచ్చే లారీల లోడ్లను వెంటనే ఆన్ లోడ్ చేసుకోని సహికరించాలని జిల్లా అధికార యంత్రాంగం చర్యలు చేపట్టాలని వారు కోరారు.

న‌ష్టపోయిన వరి పంటలను ఎల్లారెడ్డిపేట సెస్ డైరెక్టర్ వరుస కృష్ణ హారి, ఎఎంసి మాజీ చైర్మన్ గుళ్ళ పెళ్లి నర్సింహారెడ్డి, మండల తహశీల్దార్ జయంత్ కుమార్, వ్యవసాయ అధికారి భూంరెడ్డి, పట్టణ అధ్యక్షులు బండారి బాల్ రెడ్డి, బిఆర్ ఎస్ పార్టీ నాయకులు పిల్లి కిషన్, గుంటపల్లి చెరువు తండా సర్పంచ్ మాలోత్ సునితా పుణ్య నాయక్ , గ్రామ శాఖ అధ్యక్షులు.

దేవర సినిమా తో 1000 కోట్లు పక్క అంటున్న ఎన్టీయార్…అంత కాన్ఫిడెంట్ గా ఉండటానికి కారణం ఏంటంటే..?