గేమ్ చేంజర్ గురించి నన్ను అడగద్దు… నాకేం తెలియదు: దిల్ రాజు
TeluguStop.com
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ramcharan ) హీరోగా శంకర్( Shankar ) డైరెక్షన్ లో వస్తున్నటువంటి తాజా చిత్రం గేమ్ చేంజర్(Game Changer) .
పాన్ ఇండియా స్థాయిలో అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు( Dil Raju ) ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు.
ఇక ఈ సినిమాని వచ్చేయడాది సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు.
అయితే ఈ సినిమా షూటింగ్ చాలా ఆలస్యంగా జరుగుతున్న నేపథ్యంలో వచ్చే ఏడాది సంక్రాంతి ఈ సినిమా రావడం కష్టమేనని తెలుస్తోంది.
శంకర్ ఈ సినిమాకు కమిట్ అయిన తర్వాత గతంలో వాయిదా పడినటువంటి ఇండియన్ 2( Indian 2)సినిమా షూటింగ్ కి అనుమతులు లభించాయి.
"""/" /
ఈ విధంగా భారతీయుడు 2,గేమ్ చేంజర్ రెండు సినిమా షూటింగులు ఒకేసారి జరగడంతో శంకర్ కొద్ది రోజులు ఒక సినిమాకు మరి కొద్ది రోజులు మరొక సినిమాకు సమయం కేటాయిస్తున్నారు.
దీంతో ఈ సినిమాల షూటింగ్ పనులు ఆలస్యం అవుతూ వస్తున్నాయి.అయితే ఈ సినిమా కూడా రామ్ చరణ్ కూతురు పుట్టడంతో కొంతకాలం పాటు షూటింగుకు బ్రేక్ ఇచ్చారు.
ఇలా పలు కారణాల వల్ల ఈ సినిమా షూటింగ్ ఆలస్యం అవుతూ వస్తుంది.
అంతేకాకుండా ఈ సినిమాకు సంబంధించి ఈ మధ్యకాలంలో ఎలాంటి అప్డేట్స్ విడుదల చేయకపోవడంతో అభిమానులు కూడా దర్శక నిర్మాతలపై కాస్త ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
"""/" /
ఇలా ఈ సినిమా గురించి అప్డేట్ ఇవ్వాలి అంటూ సోషల్ మీడియా వేదికగా భారీగా దర్శక నిర్మాతలను( Director Producers ) ట్యాగ్ చేస్తూ పోస్టులు చేస్తున్నారు.
అయితే తాజాగా నిర్మాత దిల్ రాజు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటించిన గాండీవ దారి అర్జున సినిమా ప్రీ రిలీజ్ వేడుకలలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో భాగంగా అభిమానులు రామ్ చరణ్ సినిమా గురించి అప్డేట్ కావాలి అంటూ గట్టిగా కేకలు వేశారు.
దీంతో దిల్ రాజు మాట్లాడుతూ గేమ్ చేంజర్ సినిమా గురించి ఎవరు నన్ను అడగవద్దు.
ఈ సినిమా గురించి నాకేం తెలియదు.ఈ సినిమా అప్డేట్స్ నా చేతుల్లో లేవు అంతా డైరెక్టర్ చేతిలోనే ఉంది అంటూ దిల్ రాజు ఈ సందర్భంగా చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
చైనీస్ ఉద్యోగి వింత ప్రయాణం.. వీడియో చూస్తే మీ కళ్లను మీరే నమ్మలేరు..