జాగ్రత్త భయ్యా : ఎక్కువగా బ్లూ ఫిలిమ్స్ చూస్తే అలాంటి సమస్యలు వస్తాయంట…
TeluguStop.com
మామూలుగా వయసొచ్చిన అబ్బాయిలు లేదా అమ్మాయిలు తమ చరవాణిలో లేదా ఇతర మాధ్యమాలలో శృంగార తరహా చిత్రాలను చూడడం అప్పుడప్పుడు యాదృశ్చికంగా జరుగుతుంటుంది.
ఈ క్రమంలో కొందరు యువతీయువకులు శృంగార తరహా చిత్రాలను చూడడానికి బానిసలవుతున్నారు.దీంతో ఎక్కువగా శృంగార చిత్రాలు చూసేవారికి చాలా సమస్యలు వస్తాయని తాజాగా ఓ ప్రముఖ సంస్థ నిర్వహించిన ఈ సర్వేలో వెల్లడైంది.
అయితే ఇందులో ముఖ్యంగా యువతీ యువకులు మొదట్లో అందరిలాగే సాధారణంగా శృంగార తరహా చిత్రాలను చూడడానికి అలవాటు పడతారని, కానీ కొందరు మాత్రం వాటికి బానిసలుగా మారి పలు మానసిక సంబంధిత వ్యాధులకు గురవుతున్నారని కొందరు వైద్యులు చెబుతున్నారు.
అయితే ఇందులో ముఖ్యంగా ఎక్కువగా శృంగార చిత్రాలను చూసే వారికి ఒత్తిడి మరియు ఇతర పనులపై శ్రద్ధ లేకపోవడం వంటి సమస్యలు ఎక్కువగా ఉంటాయని చెబుతున్నారు.
అంతేకాక పెళ్ళికి ముందు శృంగారం తరహా చిత్రాలు చూడడానికి బానిసలైన వారికి పెళ్లి తర్వాత తమ వైవాహిక జీవితంలో పలు సమస్యలు వస్తాయని కాబట్టి శృంగార తరహా చిత్రాలను ఎక్కువగా చూడద్దని వైద్యులు సూచిస్తున్నారు.
మరి కొంతమందయితే శృంగారంలో పాల్గొనేటప్పడు తమ శృంగారం భాగస్వామితో శృంగార చిత్రాలలో మాదిరిగానే ప్రవర్తిస్తున్నారని ఇలా చేయడం వల్ల మానసికంగా పలు సమస్యలు వస్తాయని చెబుతున్నారు.
అయితే ఈ శృంగార చిత్రాలను చూసే అలవాటు నుంచి దూరంగా ఉండేందుకు మొదటగా తమ స్నేహితుడు లేదా సన్నిహితులతో ఎక్కువ సమయం గడిపే అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు.
అంతేగాక తమకి ఇష్టమైన పాటలను వినడం వల్ల కూడా మానసిక ప్రశాంతత ను పొందుతారట.
అలాగే తమ సెల్ ఫోన్లు లేదా శృంగార తరహా సైట్లకు కొంతకాలం పాటు దూరంగా ఉండాలని ఇలా చేయడం వల్ల పలు మానసిక రుగ్మతల సమస్యల నుంచి తప్పించుకోవచ్చట.
అయితే వారానికి 5 లేదా 7 సార్లు కంటే ఎక్కువ సార్లు శృంగార తరహా చిత్రాలను చూసినట్లయితే భవిష్యత్తులో పలు మానసిక సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుందని కాబట్టి యువతీయువకులు జాగ్రత్త గా ఉండాలని సూచిస్తున్నారు.
వీడియో వైరల్.. సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ బ్రాండ్ న్యూ కారు కొన్న యువ జంట