అన్ని దానాల కన్నా రక్త దానం మిన్న: ఎమ్మెల్యే వేముల వీరేశం

యాదాద్రి భువనగిరి జిల్లా: మాతృదేవోభవ, పితృదేవోభవ సంస్థ ఆధ్వర్యంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు కురుమేటి నవీన్ అధ్యక్ష్ణన కార్గిల్ విజయ్ దివాస్ ను పురస్కరించుకొని రామన్నపేటలోని రహదారి బంగ్లాలో శుక్రవారం నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రారంభించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని దానాల కన్న రక్తదానం మిన్న అని, యువత చెడు అలవాట్లను మాని ఆరోగ్యవంతంగా ఉండి ఆపదలో పదిమందికి రక్తం అందించే విధంగా ఉండాలన్నారు.

యువత కార్గిల్ విజయ్ దివాస్ స్ఫూర్తితో వారి ఆశయ సాధన కోసం కృషి చేయాలని, సామాజిక కార్యకర్త నోముల యాదగిరి చొరవతో రక్తదాన శిబిరం నిర్వహించడం అభినందనీయమని, మాతృదేవోభవ పితృదేవోభవ సంస్థ చేస్తున్న సేవల కృషి అద్భుతమని కొనియాడారు.

ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీటీసీ పున్న లక్ష్మీ, కాంగ్రెస్ జగన్మోహన్,మాజీ సర్పంచ్ శిరీషా, పృథ్వీరాజ్,సింగిల్ విండో చైర్మన్ నంద్యాల భిక్షం రెడ్డి,సూపరిండెంట్ డాక్టర్ వీరన్న,మాజీ వైస్ ఎంపీపీ ఉపేందర్,గంగుల వెంకట రాజిరెడ్డి,మాజీ ఎంపీటీసీలు,సర్పంచులు, ఉప సర్పంచ్ లు,అక్రమ్, బట్టి సంతోష్ కుమార్, కృష్ణ,సంస్థ ఫౌండర్ కురుమేటి నవీన్,నోముల యాదగిరి,వేముల సైదులు,మేడి రాజు నోముల విష్ణు,ప్రవీణ్,శివ, అక్కినపల్లి సైదులు, చానకొండ మల్లికార్జున్, బోడ పవన్,ప్రహ్లాద తదితరులు పాల్గొన్నారు.

ఇంటిని బాగు చేస్తుండగా కపుల్‌కి తగిలిన జాక్‌పాట్‌.. ఏంటంటే..?