నల్లగొండ జిల్లా: మిర్యాలగూడ పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్బంగా వేద శ్రీ ఆయుష్మాన్ భవ పౌండేషన్ నిర్వహకులు చిలుక విజయ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని మిర్యాలగూడ ఎమ్మేల్యే బిఎల్ఆర్ ప్రారంబించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రక్తదానం చేస్తే రక్తమార్పిడి ద్వారా అవసరమైన వారికి ఇవ్వబడుతుందని,శస్త్ర చికిత్స లేదా గాయం కారణంగా కోల్పోయిన రక్తాన్ని భర్తీ చేయడంలో మార్పిడికి సహాయపడుతుందని అన్నారు.
రక్తాన్ని సరిగ్గా తయారు చేయకుండా నిరోధించే రుగ్మతలతో బాధపడుతున్న వ్యక్తులకు కూడా ఉపయోగ పడుతుందన్నారు.
యువతీ,యువకులు అత్యధిక సంఖ్యలో పాల్గొని రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని, రక్తదానం చేసి ప్రాణ దాతలుగా మారాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో వేదశ్రీ ఆయుష్మాన్ భవ పౌండేషన్ సుభ్యులు బిఎల్ఆర్ బ్రదర్స్,అర్జున్, స్కైలాబ్ నాయక్,సిద్దు నాయక్,మునీర్ అలీ, రక్తదాతలు,యువతి యువకులు తదితరులు పాల్గొన్నారు.