మెక్‌డొనాల్డ్స్ ఔట్‌లెట్‌లో భారతీయ జంటకు షాకిచ్చిన డొనాల్డ్ ట్రంప్
TeluguStop.com
త్వరలో జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో( US Presidential Election ) ఓటర్లను ఆకట్టుకోవడానికి అభ్యర్ధులు కిందా మీదా పడుతున్నారు.
అన్నింటికి మించి ప్రముఖ ఫుడ్ ఛైన్ మెక్ డొనాల్డ్స్ తరచుగా వార్తల్లో నిలుస్తోంది.
మొన్నామధ్య మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ ( Bill Clinton )కూడా కమలా హారిస్ తరపున జార్జియాలో ఎన్నికల ప్రచారంలో నిర్వహించారు.
ఈ క్రమంలోనే మెక్‌డొనాల్డ్స్ ఔట్‌లెట్‌కు వెళ్లారు.తొలుత అక్కడి సిబ్బంది ఆయనను గుర్తుపట్టరు.
అయితే క్లింటన్ తన పేరును చెప్పడంతో స్టాఫ్ ఆశ్చర్యపోయి ఆయనతో సెల్ఫీలు దిగుతారు.
తాజాగా డొనాల్డ్ ట్రంప్ కూడా మెక్‌డొనాల్డ్స్‌లో తళుక్కున మెరిశారు. """/" /
పెన్సిల్వేనియా( Pennsylvania )లోని మెక్‌డొనాల్డ్స్ ఫుడ్ కోర్డుకి వెళ్లిన ట్రంప్.
చెఫ్ అవతారమెత్తారు.దాదాపు 30 నిమిషాల పాటు తన చేతి వంటను అక్కడి వారికి రుచి చూపించారు.
ఫ్రెంచ్ ఫ్రైస్ తయారు చేసి సర్వ్ చేశారు.ఈ క్రమంలో ఓ భారతీయ జంటకు ఫుడ్ డెలివరి ఇస్తారు ట్రంప్ .
తమకు డెలివరి ఇచ్చిన వ్యక్తి ట్రంప్ అని తెలుసుకున్న ఆ జంట షాక్‌కు గురైంది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social Media )లో వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో తమ పార్శిల్ కోసం వెయిట్ చేస్తున్న భారత సంతతి జంట కారులో డెలివరి పాయింట్ వద్దకు వస్తుంది.
అక్కడ తమ పార్శిల్ అందిస్తున్న వ్యక్తిని చూసి షాక్ అవుతుంది. """/" /
ట్రంప్‌ను గుర్తుపట్టి ఆయనకు భారతీయ సాంప్రదాయంలో నమస్కారం తెలియజేసింది ఆ జంట.
అనంతరం థ్యాంక్స్ .మిస్టర్ ప్రెసిడెంట్ అని అంటుంది.
మాట్లాడుతున్నంత సేపు ట్రంప్‌ను పదే పదే మిస్టర్ ప్రెసిడెంట్ అని అంటూనే ఉన్నారు డ్రైవింగ్ సీటులోని వ్యక్తి.
కారులో అతని పక్కనే కూర్చొని ఉన్న మహిళ కూడా ట్రంప్‌కు థ్యాంక్స్ చెప్పారు.
మా కోసం బుల్లెట్‌ను ఎదుర్కొన్నందుకు ధన్యవాదాలు తెలిపారు.దీనికి సంబంధించిన వీడియో పలు సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్స్‌లో వైరల్ అయ్యింది.
ఇప్పటి వరకు దాదాపు 8 మిలియన్ల మంది ఈ వీడియోను వీక్షించారు.
రామ్ చరణ్ కెరియర్ మీద భారీ దెబ్బ కొట్టిన శంకర్…