దోషిగా తేల్చిన కోర్ట్ : ట్రంప్‌పై సానుభూతి, విరాళాలిచ్చేందుకు ఎగబడ్డ అమెరికన్లు .. పేజీ క్రాష్

దోషిగా తేల్చిన కోర్ట్ : ట్రంప్‌పై సానుభూతి, విరాళాలిచ్చేందుకు ఎగబడ్డ అమెరికన్లు పేజీ క్రాష్

హష్ మనీ ట్రయల్‌లో( Hush Money Trial ) అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను( Donald Trump ) న్యూయార్క్ కోర్ట్ దోషిగా తేల్చిన సంగతి తెలిసిందే.

దోషిగా తేల్చిన కోర్ట్ : ట్రంప్‌పై సానుభూతి, విరాళాలిచ్చేందుకు ఎగబడ్డ అమెరికన్లు పేజీ క్రాష్

అతి త్వరలో అధ్యక్ష ఎన్నికలు జరగనున్న వేళ ఈ తీర్పు అమెరికా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది.

దోషిగా తేల్చిన కోర్ట్ : ట్రంప్‌పై సానుభూతి, విరాళాలిచ్చేందుకు ఎగబడ్డ అమెరికన్లు పేజీ క్రాష్

కోర్టు నిర్ణయాన్ని డెమొక్రాట్లు స్వాగతిస్తూ ఉండగా.ట్రంప్ మద్ధతుదారులు, రిపబ్లికన్ నేతలు మాత్రం మండిపడుతున్నారు.

తాజా తీర్పు రిపబ్లికన్లను మరింత ఐక్యం చేస్తుందని, ట్రంప్‌కు మద్ధతుగా పెద్ద ఎత్తున విరాళాలు పోటెత్తుతాయని చెప్పారు.

అయితే పరిస్ధితులు చూస్తే అలాగే కనిపిస్తున్నాయి.కోర్టు తీర్పు వెలువడిన గంట తర్వాత అమెరికా అధ్యక్ష ఎన్నికల కోసం ట్రంప్ ఏర్పాటు చేసిన విరాళాల పేజీకి( Donation Page ) భారీ ట్రాఫిక్ నమోదై క్రాష్ అయ్యింది.

ట్రంప్‌కు విరాళాలు ఇవ్వాలని అమెరికన్లు నిర్ణయించుకోవడమే ఇందుకు కారణం.జ్యూరీ ట్రంప్‌ను దోషిగా తేల్చిన తర్వాత .

ఆయన ప్రచార బృందం ట్రూత్ సోషల్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది.‘ నేను రాజకీయ ఖైదీని, కఠినమైన రాజకీయ మంత్రగత్తె వేటలో దోషిగా తేలాను, నేనేమి తప్పు చేయలేదు ’’ అంటూ ట్రంప్ నేషనల్ కమిటీ జాయింట్ ఫండ్ రైజింగ్ కమిటీ పేర్కొంది.

మాజీ అధ్యక్ష సలహాదారు క్రిస్ లాసివిటా( Chris LaCivita ) మాట్లాడుతూ.ఈ క్రాష్ చాలా మంచి సంకేతమన్నారు.

మిలియన్లకొద్దీ అమెరికన్ దేశభక్తులు డొనాల్డ్ ట్రంప్ ప్రచారానికి( Donald Trump Campaign ) విరాళాలు ఇవ్వాలనుకుంటున్నారని ప్రశంసించారు.

దాదాపు 800K డాలర్లు ట్రంప్ ప్రచార పేజీకి విరాళంగా వచ్చినట్లుగా అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.

"""/" / కాగా.స్టార్మీ డేనియల్‌తో( Stormy Daniel ) ట్రంప్ సన్నిహితంగా గడిపారని ఆరోపణలు ఎప్పటి నుంచో వస్తున్నాయి.

2016 అధ్యక్ష ఎన్నికల సమయంలో ఆమె ఈ సంగతి బయటపెట్టకుండా ఉండేందుకు ట్రంప్ భారీ మొత్తంలో డబ్బు ముట్టజెప్పారని , తన లాయర్ ద్వారా స్టార్మీకి సొమ్ము అందజేశారని అభియోగాల్లో పేర్కొన్నారు.

ప్రచారం కోసం అందిన విరాళాల నుంచి ట్రంప్ ఈ మొత్తాన్ని కేటాయించారని ఆరోపించారు.

ఇందుకోసం వ్యాపార రికార్డులను తారుమారు చేశారని కూడా ట్రంప్‌పై మొత్తంగా 34 అభియోగాలు మోపారు.

మరోవైపు ట్రంప్‌తో తనకు అక్రమ సంబంధం ఉన్నట్లు స్టార్మీ న్యాయస్థానంలో వాంగ్మూలం ఇచ్చారు.

"""/" / న్యాయస్థానం దోషీగా తేల్చడంతో ట్రంప్ జైలుకెళ్తారా.అధ్యక్ష ఎన్నికల బరి నుంచి తప్పుకోవాల్సిందేనా అన్న చర్చ జరుగుతోంది.

అయితే దోషిగా తేలినంత మాత్రాన ట్రంప్ అభ్యర్ధిత్వానికి వచ్చిన ప్రమాదం ఏం లేదని, గతంలోనూ ఇలాంటి పరిణామాలు చోటు చేసుకున్నాయని న్యాయ నిపుణులు గుర్తుచేస్తున్నారు.

దోషిగా తేలి గృహ నిర్బంధాన్ని ఎదుర్కొన్నా వర్చువల్‌గా ట్రంప్ ప్రచారం చేసుకోవచ్చని వారు చెబుతున్నారు.

కోర్టు శిక్ష ఖరారు చేసిన అనంతరం ట్రంప్ దీనిపై పై కోర్టులో అప్పీల్ చేసుకునే వెసులుబాటు కూడా ఉందని అంటున్నారు.

సమంతను నిర్మాతలు, ప్రేక్షకులు మరిచిపోతున్నారా.. సామ్ ఇలా చేస్తే ఎలా అంటూ?