అమెరికా అధ్యక్ష ఎన్నికలు .. ట్రంప్ నామినీ అవుతారని నేను అనుకోను : నిక్కీ హేలీ ఆసక్తికర వ్యాఖ్యలు
TeluguStop.com
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ ( Republican Party )తరపున పోటీ చేస్తున్నారు భారత సంతతికి చెందిన మహిళా నేత, సౌత్ కరోలినా మాజీ గవర్నర్ నిక్కీ హేలీ( Nikki Haley ).
నెల క్రితం వరకు అంతంత మాత్రంగా ప్రచారం సాగించిన ఆమె.ఇటీవల జరిగిన రిపబ్లికన్ పార్టీ తొలి ప్రైమరీతో ఒక్కసారిగా లైమ్ లైట్‌లోకి వచ్చారు.
ఈ చర్చా కార్యక్రమంలో తన ప్రత్యర్ధి, భారత సంతతికి చెందిన వివేక్ రామస్వామితో( Vivek Ramaswamy ) నిక్కీ హేలీ హోరాహోరీగా తలడ్డారు.
ఆ మరుసటి రోజు నుంచే ఆమె పోల్ సర్వేల్లోనూ, విరాళాల సేకరణలోనూ ముందంజలో నిలిచారు.
"""/" /
ఈ క్రమంలో నిక్కీ హేలీ మీడియాతో మాట్లాడుతూ.మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) 2024 అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధిగా వుండరని జోస్యం చెప్పారు.
ప్రముఖ వార్తా సంస్ధ ‘‘ ది వాల్ స్ట్రీట్ జర్నల్ ’’( The Wall Street Journal ) విడుదల చేసిన తాజా ఒపీనియన్ పోల్‌లో ట్రంప్, రాన్ డిసాంటిస్ తర్వాత పాపులారిటీ రేటింగ్ పరంగా హేలీ మూడో స్థానంలో వున్నట్లు వెల్లడించింది.
ఈ లిస్ట్‌లో వివేక్ రామస్వామి నాలుగో స్థానంలో నిలిచారు.ఈ సందర్భంగా సీబీఎస్ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నిక్కీ హేలీ మాట్లాడుతూ.
ట్రంప్ నామినీ అవుతారని తాను అనుకోవడం లేదన్నారు.జో బైడెన్, కమలా హారిస్ చేస్తున్న దానికంటే రిపబ్లికన్ పార్టీ మంచి చేస్తుందని నిక్కీ అన్నారు.
"""/" /
అమెరికాలోని అన్ని ప్రధాన జాతీయ పోల్స్‌ను పర్యవేక్షించే రియల్ క్లియర్ పాలిటిక్స్ ప్రకారం.
ట్రంప్ 53.6 శాతం ప్రజామోదంతో అగ్రస్థానంలో వుండగా.
డిసాంటిస్ (13 శాతం), రామస్వామి (7.1 శాతం), హేలీ (6 శాతం)తో నిలిచారు.
బైడెన్‌కు ఓటు వేస్తే కమలా హారిస్‌కు వేసినట్లేనని ఆమె వ్యాఖ్యానించారు.ఇక ట్రంప్ అభియోగాలపై ఆమె మాట్లాడుతూ.
నేరం రుజువయ్యే వరకు ఆయన నిర్దోషేనని చెప్పారు.అమెరికా ప్రజలు తెలివైన వారని.
శిక్ష పడిన వ్యక్తికి ఓటు వేయరని నిక్కీ హేలీ పేర్కొన్నారు.తాను ఎప్పుడూ రిపబ్లికన్ నామినీకి మద్ధతు ఇస్తానని చెప్పారు.
కమలా హారిస్‌ను ఓడించే వ్యక్తిని మనం ఎన్నుకోబోతున్నామని హేలీ అన్నారు.
ఈ రెమెడీని పాటిస్తే ఫేషియల్ అవసరమే ఉండదు.. అందంగా మెరిసిపోవడం ఖాయం!