ట్రంప్ అరాచకానికి ఇది పరాకాష్ట..!!!

అమెరికాలో ఎన్నికల్లో ఉత్కంఠ భరితంగా జరిగిన పోరులో ఎట్టకేలకు బిడెన్ విజయం సాధించాడు.

జనవరి నెలలో అధికారాన్ని చేపట్టడానికి బిడెన్ సిద్దంగా ఉండటంతో పాటు, ఇప్పటికే అధికారిక బదలాయింపులపై దృష్టి పెట్టారు.

ఎవర్ని ఎక్కడ ఉంచాలి, ప్రస్తుతం ఎలాంటి సవాళ్ళు ఎదుర్కోవాల్సి ఉందొ వాటిపై సమగ్ర నివేదికలతో సహా, పరిష్కారానికి పక్కా ప్రణాళికతో సిద్దమవుతున్నారు.

ఇక బిడెన్ అధికారం చేపట్టడమే తరువాయి.ఇదిలా ఉంటే ట్రంప్ మాత్రం తాను ఎట్టిపరిస్థితుల్లోనూ అధికారాన్ని బిడెన్ కి ఇవ్వనని తానే అధ్యక్షుడినంటూ మొండిపట్టు పడుతున్నారు.

ట్రంప్ కు మద్దతుగా రిపబ్లికన్ నేతలు చాలామంది కోర్టుల్లో కేసులు వేస్తున్నారు.వారు వేసిన కేసుల్లో సరైన సాక్ష్యాధారాలు లేవంటూ కోర్టులు కేసులు కొట్టేస్తున్నా కుప్పలు తెప్పలుగా కేసులు వేయడంపై డెమోక్రటిక్ పార్టీ నేతలు మండిపడుతున్నారు.

ఇదిలాఉంటే తాజాగా ట్రంప్ ట్వీట్ చేస్తూ మనం అతి త్వరలో అధికారాన్ని చేపట్టబోతున్నాం.

మళ్ళీ మనదైన పాలన త్వరలో రాబోతోంది.అమెరికాని అగ్ర రాజ్యంగా మార్చడానికి మరోసారి అవకాశం దక్కనుందని సంచలన ట్వీట్ చేశారు.

ఇదిలాఉంటే ఎన్నికలలో అవకతవకలు జరిగాయంటూ వచ్చిన కేసులను విచారణకు తీసుకోవాలని అమెరికా ప్రధాన న్యాయమూర్తి బార్ ఆదేశించారు.

త్వరతిగతిన విచారణ జరిపి జరిగిన అక్రమాలపై నిగ్గు తెల్చాలని స్పష్టం చేశారు.అయితే ట్రంప్ బృందం వేస్తున్న కేసులకు వ్యతిరేకంగా ఓ న్యాయమూర్తి రాజీనామా చేశారు.

అలాగే ట్రంప్ కేసులు వాదించేది లేదని న్యాయవాదులు చేతులు ఎత్తేస్తున్నారు.ఒక పక్క వరుసగా కేసుల మీద కేసులు వేయిస్తూ రచ్చ రచ్చ చేస్తున్న ట్రంప్ అమెరికాలో ప్రజావ్యతిరేక విధానాలను అనుసరిస్తున్నారని, అమెరికా వ్యాప్తంగా అలజడులు సృష్టించడానికి పన్నాగాలు పన్నుతున్నారని ఆరోపిస్తున్నారు డెమోక్రటిక్ పార్టీ నేతలు.

అంతేకాదు అధికార మార్పిడి కోసం వచ్చే బిడెన్ వర్గానికి సహకరించవద్దని హుకుం జారీ చేశారు ట్రంప్.

ప్రస్తుత పరిస్థితి చూస్తుంటే ట్రంప్ అమెరికాలో రాజకీయ అస్థిరత నెలకొనే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తునాయనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

శరీరానికి శక్తినిచ్చే క్యారెట్.. ఇలా తీసుకుంటే మరిన్ని బెనిఫిట్స్!