చెవికి కట్టులేకుండా డొనాల్డ్ ట్రంప్.. ఫోటోలు వైరల్, కోలుకున్నట్లేనా..?

అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో పాల్గొని చావు అంచులదాకా వెళ్లొచ్చారు మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అభ్యర్ధి డొనాల్డ్ ట్రంప్.

( Donald Trump ) ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియాలోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ట్రంప్‌ ప్రసంగిస్తుండగా ఓ యువకుడు కాల్పులకు తెగబడ్డాడు.

దీంతో బుల్లెట్ ఆయన కుడి చెవి పైభాగం నుంచి దూసుకెళ్లింది.కాల్పుల శబ్ధం విని అప్రమత్తమైన ట్రంప్.

వెంటనే పోడియం కింద దాక్కొని ప్రాణాలను రక్షించుకున్నారు.రెప్పపాటులో అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ట్రంప్ చుట్టూ రక్షణ కవచంలా నిలబడి ఆయనను సురక్షితంగా వాహనంలోకి ఎక్కించారు.

మరోవైపు సీక్రెట్ సర్వీస్ సిబ్బందిలోని స్నైపర్ షూటర్ వేగంగా స్పందించి.దుండగుడిని మట్టుబెట్టాడు.

ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

ఈ ఘటనలో ట్రంప్ కుడిచెవికి( Trump Right Ear ) తీవ్ర గాయమవ్వగా.

ఆసుపత్రిలో చికిత్స తీసుకుని కోలుకున్నారు .చావుని అతి దగ్గరగా చూసినప్పటికీ ఏ మాత్రం భయపడకుండా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు డొనాల్ట్ ట్రంప్.

"""/" / ఈ పరిణామాలతో ఆయనకు ప్రజల్లో అనూహ్యంగా మద్ధతు పెరుగుతోంది.ఇటీవల వెలువడిన పలు సర్వేలు, ముందస్తు పోల్స్‌లో ట్రంప్‌ ముందంజలో ఉంటున్నారు.

మరోవైపు తనపై హత్యాయత్నం జరిగిన స్పాట్‌లోనే మరో ర్యాలీ నిర్వహిస్తున్నట్లుగా ఆయన ప్రకటించి సంచలనం సృష్టించారు.

నాటి ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఫైర్‌ఫైటర్ గౌరవార్ధం బట్లర్‌లోని అదే ప్రదేశంలో ర్యాలీ నిర్వహించబోతున్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ సోషల్ మీడియాలో వెల్లడించారు.

దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే తెలియజేస్తానని ఆయన పేర్కొన్నారు. """/" / ఇకపోతే.

హత్యాయత్నం తర్వాత కుడిచెవికి బ్యాండేజ్‌తోనే ట్రంప్ ప్రజల్లో తిరుగుతున్నారు.ఇజ్రాయెల్ ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహూతో( Benjamin Netanyahu ) శుక్రవారం తన మార్ ఏ లాగో రిసార్ట్‌లో( Mar-a-Lago ) సమావేశమయ్యారు ట్రంప్.

ఈ భేటీకి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.వాటిలో ట్రంప్ కుడిచెవికి కట్టు లేదు.