హత్య కేసు నిందితులతో వేదికపై.. మరో వివాదంలో డొనాల్డ్ ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల వేళ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) వివాదంలో ఇరుక్కున్నారు.

గురువారం జరిగిన బ్రాంక్స్ ర్యాలీలో ట్రంప్ వేదికపైకి ఆహ్వానించిన ఇద్దరు డ్రిల్ ర్యాపర్లు షెఫ్ జీ, స్లీపీ హాలో( Chef G, Sleepy Hollow ) 2023 నాటి హత్య కేసులో సహ కుట్రదారులుగా అభియోగాలు ఎదుర్కొంటున్నారు.

నేరస్తులను వేదికపైకి పిలిచారంటూ ట్రంప్‌పై అధికార డెమొక్రాట్ పార్టీ నేతలు విరుచుకుపడుతున్నారు.డెమొక్రాట్లకు , శ్వేతజాతీయేతర వర్గీయులకు కంచుకోట వంటి న్యూయార్క్‌లో ట్రంప్ ర్యాలీకి అనూహ్య మద్ధతు లభించడంతో రిపబ్లికన్లు మాత్రం ఖుషీ అవుతున్నారు.

రాపర్లు వేదికపైకి వచ్చిన వెంటనే .వారి దంతాల మీద మెరిస్ డైమండ్ గ్రిల్స్ తనకు ఎంతో ఇష్టమని ట్రంప్ పేర్కొన్నారు.

ట్రంప్ మనందరికీ విజయాలను అందించబోతున్నారని షెఫ్ జీ అన్నారు.అలాగే వేదికపై నుంచి దిగుతూ ట్రంప్ ఐకానిక్ ప్రచార నినాదమైన ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్ ’( Make America Great Again ) అంటూ స్లీపీ హాలో గట్టిగా అరిచారు.

"""/" / షెఫ్ జీ అసలు పేరు మైఖేల్ విలియమ్స్( Michael Williams ) (25).

యూట్యూబ్, స్పాటిఫైలోని అతను పాటలు, వీడియోలకు మిలియన్ల కొద్దీ వీక్షణలు వచ్చాయి.బ్రూక్లిన్ డిస్ట్రిక్ట్ అటార్నీ ఎరిక్ గొంజాలెజ్( Brooklyn District Attorney Eric Gonzalez ) ఏడాది క్రితం ఆయుధాలు స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నించిన కేసులో విలియమ్స్ జైలుశిక్ష సైతం అనుభవించాడు.

ఇక స్లీపీ హాలోగా ప్రసిద్ధి చెందిన 24 ఏళ్ల రాపర్ టెగన్ ఛాంబర్స్ దాదాపు 11 మిలియన్ల నెలవారీ స్పాటిఫై ఆడియన్స్‌ను కలిగి ఉన్నాడు.

గ్యాంగ్ కేసులో ఆయన కుట్రకు పాల్పడ్డారనే ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.అయితే తామిద్దరం నిర్దోషులమని షెఫ్ జీ, స్లీపీ హాలోలు చెబుతున్నారు.

ర్యాపర్లు ఇద్దరూ వచ్చే నెలలో కోర్టుకు హాజరుకానున్నారు. """/" / జూన్ 2023లో ఆయుధాల కేసులో పెరోల్ పొందిన తర్వాత షెప్ జీ ఈ ఏడాది ఏప్రిల్ వరకు జైలులోనే ఉన్నాడు.

అయితే 1.5 మిలియన్ డాలర్ల పూచీకత్తుపై న్యాయమూర్తి అతనికి బెయిల్ మంజూరు చేశారు.

స్లీపీ హాలో కూడా 2 లక్షల డాలర్ల పూచీకత్తుపై మే 2023లో విడుదలయ్యాడు.

ర్యాపర్లపై తమ ఆరోపణలను సమర్ధించేందుకు తమ వద్ద టెక్ట్స్ సందేశాలు, సోషల్ మీడియా సహా సాక్ష్యాలు వున్నాయని ప్రాసిక్యూటర్లు పేర్కొన్నారు.

రుషికొండ భవనాలపై తీవ్ర విమర్శలు.. వైసీపీ సమాధానం ఇదే