Donald Trump : అమెరికా అధ్యక్ష ఎన్నికలు : ట్రంప్‌కు ఎలాన్ మస్క్ ఇన్వెస్టర్‌గా మారబోతున్నారా..?
TeluguStop.com
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) .
టెస్లా అధినేత , బిలియనీర్ ఎలాన్ మస్క్( Elon Musk ) మధ్య సన్నిహిత సంబంధాలున్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం అగ్రరాజ్యంలో అధ్యక్ష ఎన్నికల ప్రచారం హోరాహోరీగా జరుగుతోంది.నిన్న కీలకమైన సూపర్ ట్యూస్‌డే ముగియగా.
ట్రంప్, బైడెన్ మధ్య మరోసారి పోరు జరిగే సూచనలు కనిపిస్తున్నాయి.ఈ నేపథ్యంలో ట్రంప్‌కు మస్క్ ఇన్వెస్టర్‌గా మారబోతున్నారా అంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.
ఈ మేరకు ట్రంప్‌తో ఎలాన్ మస్క్ సమావేశమైనట్లుగా సమాచారం.న్యూయార్క్ టైమ్స్ కథనం ప్రకారం.
ఫ్లోరిడాలోని పామ్ బీచ్‌లో( Palm Beach, Florida ) జరిగిన ఈ సమావేశంలో అనేకమంది సంపన్న రిపబ్లికన్ దాతలు కూడా పాల్గొన్నారు.
"""/" /
ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్‌కు( Joe Biden ) వ్యతిరేకంగా ట్రంప్ తన ఎన్నికల ప్రచారానికి ఆర్ధిక సహాయం కోసం చురుగ్గా ప్రయత్నిస్తున్నారు.
మార్చి 2న ట్రంప్, ఎలాన్ మస్క్‌ల యాజమాన్యంలోని ప్రైవేట్ జెట్‌లు పామ్ బీచ్ విమానాశ్రయంలో ల్యాండింగ్ అవుతున్నప్పుడు ఆసక్తికరమైన పరిశీలన జరిగింది.
వారి రాకపోకలు కేవలం గంటలోపే ముగిశాయి.ఎలాన్ మస్క్ ట్రంప్‌కు ఆర్ధిక సహాయాన్ని అందిస్తారా లేక 2024 అధ్యక్ష ఎన్నికల్లో మద్ధతు ఇస్తారా అనే చర్చ జరుగుతోంది.
అంతకుముందు సెప్టెంబర్ 2023లో .ఎలాన్ మస్క్ వైట్‌హౌస్‌లో ప్రత్యక్షమై కృత్రిమ మేథస్సు పురోగతి గురించి చర్చించాడు.
జూన్ 2017లో ఎలాన్ మస్క్ .ట్రంప్ సలహా మండలిని విడిచిపెట్టాడు.
పారిస్ వాతావరణ ఒప్పందం నుంచి అమెరికా వైదొలిగేలా ట్రంప్ తీసుకున్న నిర్ణయానికి ప్రతిస్పందనగా మస్క్ ఈ నిర్ణయం తీసుకున్నారు.
"""/" /
మస్క్ సంపద దాదాపు 200 బిలియన్ డాలర్లు.ఇది ట్రంప్‌కు అనుకూలంగా వాడితే.
బైడెన్‌ను ధీటుగా ఎదుర్కోవచ్చు.అధ్యక్ష ఎన్నికల్లో భారీగా పెట్టుబడులు పెట్టిన ఇతర బిలియనీర్‌లతో పోలిస్తే.
మస్క్ ఎప్పుడూ పక్షపాత వైఖరిని కలిగివుండరు.ఆయన యాజమాన్యంలో నడుస్తోన్న టెస్లా, స్పేస్ ఎక్స్‌లు ( Tesla , SpaceX )చాలాకాలంగా ఫెడరల్ ప్రయోజనాలతో ముడిపడి వున్నాయి.
ప్రభుత్వ ఒప్పందాలు, ప్రోత్సాహకాల ప్రయోజనాలను మస్క్ అందుకుంటున్నారు.అయినప్పటికీ ఆయన రాజకీయ విరాళాలు సమతుల్యంగా వున్నాయి.
అయితే ఇటీవల బైడెన్ ఇమ్మిగ్రేషన్ విధానాలపై మస్క్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి.
అధ్యక్షుడి ఇమ్మిగ్రేషన్ పాలసీ వల్ల అమెరికా అస్తిత్వానికే ప్రమాదం ఏర్పడిందని, అమెరికా ప్రజాస్వామ్యానికి ముప్పు వాటిల్లుతుందని ఎలాన్ మస్క్ ఆవేదన వ్యక్తం చేశారు.
ట్రాఫిక్ పోలీసునే కొట్టిన ఆటో డ్రైవర్.. వీడియో చూస్తే షాకే..