కమలా హారిస్‌తో మరో డిబేట్ లేనట్లేనా.. హింట్ ఇచ్చిన డొనాల్డ్ ట్రంప్
TeluguStop.com
అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ హోరాహోరీగా జరుగుతోంది.రిపబ్లికన్ పార్టీ నుంచి డొనాల్డ్ ట్రంప్,( Donald Trump ) డెమొక్రాటిక్ పార్టీ నుంచి కమలా హారిస్‌లు( Kamala Harris ) బరిలో నిలిచిన సంగతి తెలిసిందే.
జో బైడెన్ రేసులో ఉన్నంత వరకు ఓ లెక్క.కమలా హారిస్ రంగంలోకి దిగిన తర్వాత మరో లెక్క అన్నట్లుగా పరిస్ధితి తయారైంది.
అన్ని విషయాల్లోనూ ట్రంప్‌కు గట్టిపోటీ ఇస్తున్నారు కమలా హారిస్.ప్రచారంలో కమలా హారిస్ దూసుకెళ్లడంతో పాటు విరాళాల సేకరణలోనూ ముందున్నారు.
డెమొక్రాటిక్ పార్టీ అధ్యక్ష అభ్యర్ధిగా ఆమె బరిలో నిలిచిన నాటి నుంచి ఇప్పటి వరకు 1 బిలియన్ డాలర్ల విరాళాలు అందినట్లు అమెరికన్ మీడియా చెబుతోంది.
ట్రంప్‌తో జరిగిన ప్రెసిడెన్షియల్ డిబేట్( Presidential Debate ) తర్వాత కమలా హారిస్‌కు మద్ధతిచ్చే వారి సంఖ్య భారీగా పెరిగిందని విశ్లేషకులు చెబుతున్నారు.
"""/" /
ఎన్నికల్లో భాగంగా కమల- ట్రంప్‌ల మధ్య మరో ప్రెసిడెన్షియల్ డిబేట్ జరగాల్సి ఉంది.
నవంబర్ 5కు సమయం దగ్గరపడటంతో ఇది ప్రాముఖ్యతను సంతరించుకుంది.ఈ నెలాఖరులో అధ్యక్ష అభ్యర్ధుల మధ్య చర్చా కార్యక్రమం నిర్వహిస్తామని ఫాక్స్ న్యూస్ ప్రకటించిన గంటల్లోనూ కమలా హారిస్‌తో మరో డిబేట్‌లో పాల్గొనేది లేదన్నట్లుగా డొనాల్డ్ ట్రంప్ సంకేతాలిచ్చారు.
ముందస్తు ఓటింగ్( Early Voting ) ఇప్పటికే ప్రారంభమైందని.మళ్లీ మ్యాచ్ ఉండదని ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఫ్లాట్‌ఫామ్‌లో ఈ మేరకు తెలిపారు.
"""/" /
ఇకపోతే.గత నెల 10వ తేదీన పెన్సిల్వేనియాలోని నేషనల్ కాన్‌స్టిట్యూషన్ సెంటర్ వేదికగా కమలా హారిస్ - డొనాల్డ్ ట్రంప్‌ల మధ్య చర్చా కార్యక్రమం వాడివేడిగా జరిగింది.
అమెరికా ఆర్ధిక పరిస్ధితి, అక్రమ వలసలు, గర్భవిచ్ఛిత్తి హక్కులు సహా పలు అంశాలపై ఇద్దరు నేతలు చర్చించుకున్నారు.
తొలి నుంచి కమలా హారిస్‌ను కమ్యూనిస్ట్‌గా పేర్కొంటూ విమర్శలు చేస్తున్న ట్రంప్ అదే కంటిన్యూ చేశారు.
ఆయన వ్యాఖ్యలకు కమలా హారిస్ కౌంటరిచ్చారు.ట్రంప్ డిక్టేటర్ అని.
ఆయన తప్పులను తాను , బైడెన్ సరిదిద్దామన్నారు.ఈ డిబేట్‌లో ట్రంప్‌పై కమలా హారిస్ పైచేయి సాధించారని అమెరికన్ మీడియా అంటోంది.
మట్కా కోసం ఇష్టంలేని పనులు కూడా చేశాను.. వరుణ్ తేజ్ షాకింగ్ కామెంట్స్!