ట్రంప్ కి టైం అస్సలు బాలేదు…ఇరుక్కు పోతున్నాడుగా…!!!
TeluguStop.com
అమెరికా వ్యాప్తంగా కంటి మీద కునుకు లేకుండా ప్రజలని తీవ్ర భయబ్రాంతులకి గురించేస్తున్న ఏకైక వెపన్ కరోనా వైరస్.
ఈ వైరస్ దెబ్బకి అమెరికా అల్లకల్లోకం అయ్యిపోయింది.ఎంతో మంది వీధిన పడ్డారు.
డబ్బుల్లేవ్.తినడానికి సరైన తిండి లేదు.
ఉద్యోగం లేదు ఒకటి కాదు రెండు కాదు కష్టాలన్నీ అమెరికాలోనే తిష్ట వేశాయా అన్నట్టుగా అమెరికాలో దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి.
ఇదిలాఉంటే సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి అన్నట్టుగా.ట్రంప్ కి కరోనా దెబ్బ గట్టిగా తగిలింది.
కరోనా సోకక పోయినా దాని ప్రభావం ట్రంప్ ఏ రేంజ్ లో ఉందో ప్రతీ ఒక్కరూ గమనిస్తూనే ఉన్నారు.
ఇప్పటికే ట్రంప్ చేతకానోడు అంటూ అమెరికా ప్రజలు దుమ్మెత్తి పోస్తుంటే.తాజాగా అమెరికా ఆరోగ్య సేవల సంస్థ ఏజెన్సీ కి చెందిన డైరెక్టర్ రిక్ బ్రైట్ ట్రంప్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు.
ట్రంప్ ప్రభుత్వం తీవ్ర అలసత్వం చేసిందని కరోనాపై నేను జనవరిలోనే హెచ్చరిక చేశానని కానీ తన మాటలు పట్టించుకోక పోగా నాపై అభియోగాలు మోపారని పెద్ద బాంబు పేల్చారు.
తమ ఏజెన్సీ కీలక అధికారి అలెక్స్ కి ఈ విషయం తెలిపానని ఆయన తనని ఉద్యోగం నుంచీ తొలగించారని అన్నారు.
అయితే బ్రైట్ ని విధుల నుంచీ తొలగించడంపై అతని లాయర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఇది చట్టానికి వ్యతిరేకమని వాదించారు దాంతో సదరు సంస్థ అతడిని మరొక ప్రాంతానికి బదిలీ చేశామని తెలిపింది.
ఇదిలాఉంటే తాజాగా బ్రైట్ చేసిన ఆరోపణలు ట్రంప్ ని మరింత ఇరకాటంలోకి నెట్టడం ఖామని అంటున్నారు విశ్లేషకులు.
“నీరు పారకుంటే.. నెత్తురు పారుతుంది” పాక్ పీపుల్స్ పార్టీ చీఫ్ ఘాటు వ్యాఖ్యలు!