హత్యాయత్నం జరిగినా భయపడని వైనం.. శనివారం మిచిగన్‌ సభలో పాల్గొననున్న ట్రంప్

అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భాగంగా గత వారం పెన్సిల్వేనియాలోని బట్లర్‌లో( Butler, Pennsylvania ) జరిగిన ర్యాలీలో ప్రసంగిస్తున్న మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై హత్యాయత్నం జరిగిన సంగతి తెలిసిందే.

దుండగుడు అత్యంత సమీపం నుంచి ఆయనపై కాల్పులు జరపడంతో రెప్పపాటులో ట్రంప్ తప్పించుకున్నారు.

అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అమెరికాలో ఏకంగా మాజీ అధ్యక్షుడిని హతమార్చడానికి ప్రయత్నించడం కలకలం రేపింది.

కాల్పుల శబ్ధం విని అప్రమత్తమైన ట్రంప్.వెంటనే పోడియం కింద దాక్కొని ప్రాణాలను రక్షించుకున్నారు.

రెప్పపాటులో అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ట్రంప్ చుట్టూ రక్షణ కవచంలా నిలబడి ఆయనను సురక్షితంగా వాహనంలోకి ఎక్కించారు.

సీక్రెట్ సర్వీస్ సిబ్బందిలోని స్నైపర్ షూటర్ వేగంగా స్పందించి.దుండగుడిని మట్టుబెట్టాడు.

ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

బుల్లెట్ కుడిచెవి మీదుగా దూసుకెళ్లడంతో ట్రంప్ గాయపడ్డారు.హత్యాయత్నం , ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో డొనాల్డ్ ట్రంప్ భద్రతను అధికారులు కట్టుదిట్టం చేశారు.

"""/" / మిల్వాకీలో జరిగిన రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో డొనాల్ట్ ట్రంప్‌ను( Donald Trump ) అధికారికంగా అధ్యక్ష అభ్యర్ధిగా నామినేట్ చేశారు.

దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రతినిధులు ట్రంప్‌ అభ్యర్ధిత్వానికి ఆమోదం తెలిపారు.హత్యాయత్నం జరిగినప్పటికీ ఎన్నికల ప్రచారంలో తిరిగి పాల్గొనాలని డొనాల్డ్ ట్రంప్ నిర్ణయించారు.

తన రన్నింగ్ మేట్ (ఉపాధ్యక్ష అభ్యర్ధి)గా జేడీ వాన్స్‌ను( JD Vance ) ప్రకటించిన తర్వాత ఇద్దరూ కలిసి మిచిగాన్‌లో జరగనున్న బహిరంగ సభలో పాల్గొననున్నారు.

"""/" / రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌ను ఎలాంటి ఇబ్బంది లేకుండా ముగించిన ట్రంప్ బృందం దూకుడుగా ఉంది.

పార్టీపై సంపూర్ణ నియంత్రణను ప్రదర్శించడం వంటి పరిణామాలు ట్రంప్‌కు అనుకూలంగా ఉన్నాయి.శనివారం సాయంత్రం డౌన్‌టౌన్ గ్రాండ్ ర్యాపిడ్స్‌లోని ఇండోర్ అరేనాలో ర్యాలీ జరగనుంది.

దాదాపు 12 వేల మంది పాల్గొనే సామర్ధ్యం ఉన్న వాన్ ఆండెల్ అరేనాను యూఎస్ సీక్రెట్ సర్వీస్, ఎఫ్‌బీఐ, స్థానిక పోలీసులు జల్లెడ పడుతున్నారు.

ఆ ఒక్క మాటతో … విజయసాయిని జగన్ పక్కన పెట్టేస్తారా ?