ఎవడి డప్పు వాడు కొట్టుకోవాల్సిందే..ఆఖరికి ట్రంప్ కూడా..!!!

కరోనా ప్రపంచంలో ఉన్న దేశాలన్నిటి కంటే కూడా అమెరికాపై తీవ్రమైన ప్రభావం చూపిందన్న విషయం విధితమే.

లక్షల సంఖ్యలో కేసులు నమోదయ్యాయి.వేల సంఖ్యలో ప్రజలు మృతి చెందారు.

ఈ క్రమంలోనే అమెరికా అధ్యక్షుడి పాలన అసమర్ధంగా ఉందంటూ ఎంతో మంది ట్రంప్ పై మండిపడుతున్నారు కూడా.

డెమోక్రటిక్ పార్టీ నేతలు ట్రంప్ పై ఓ రేంజ్ లో ఫైర్ అవుతూ రోజుకో రకంగా ట్రంప్ ని టార్గెట్ చేస్తున్నారు.

మీడియా సైతం ట్రంప్ అలసత్వ కారణంగానే అమెరికా భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తోందని అంటోంది.

ప్రజలు కూడా ట్రంప్ చర్యలపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.ఇలా నలువైపులా అందరూ ట్రంప్ పాలనపై నిప్పులు చేరుగుతుంటే ట్రంప్ మాత్రం ఎప్పటిలానే తన విభిన్నమైన వైఖరిని ప్రదర్శించాడు.

అసలు అమెరికాకి ఇప్పటి వరకూ అధ్యక్షుడిగా చేసిన వారిలో నేనే బెస్ట్ ప్రెసిడెంట్ అంటూ ట్వీట్ చేసేశాడు.

"""/"/ అమెరికా చరిత్రలో నా లాంటి ప్రెసిడెంట్ లేడంటూ ట్విట్టర్ వేదికగా ప్రకటించేసుకున్నాడు.

అమెరికా చరిత్ర గురించి తెలిసిన వాళ్ళందరూ నాలా ఏ అధ్యఖ్సుడు కష్టపదలేదని అంటున్నారు.

అది వారి అభిప్రాయం కానీ ఇది నిజమే నాలా ఏ అధ్యక్షుడు కష్టపడలేదని రాసుకొచ్చారు.

ఈ మూడేళ్ళలో నిద్ర లేని రాత్రుళ్ళు గడిపా, ఉదయం ఆఫీస్ కి వస్తే రాత్రి వరకూ ఆఫీసుకే పరిమితం అయిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

న్యూయార్క్ టైమ్స్ లో మాత్రం నా అలవాట్లు, నా వ్యక్తితం, ఆహారపు అలవాట్లు గురించి ఎవడో జర్నలిస్ట్ నా గురించి తెలుసుకోకుండా రాసేశారు.

అందుకే నేను నా గురించి చెప్తున్నాను అంటూ మరో సారి తన తింగరి తనాన్ని ట్విట్టర్ వేదికగా బయట పెట్టుకున్నాడు.

అంతేకాదు మీడియాని టార్గెట్ చేసిన ట్రంప్ నకిలీ వార్తలు రాసే వార్తా సంస్థలపై చర్యలు తీసుకునేలా ప్రత్యేక చట్టాన్ని రూపొందించాలని లాయర్లకి తెలిపారు.

ఎమ్మెల్సీ కవిత బెయిల్ పిటిషన్లపై రౌస్ అవెన్యూ కోర్టులో తీర్పు