సింగిల్‌ షాట్‌కి దుండగుడు హతం.. ఆ సీక్రెట్ సర్వీస్ స్నైపర్‌పై డొనాల్డ్ ట్రంప్ ప్రశంసలు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌( Donald Trump )పై గత వారం జరిగిన హత్యాయత్నం ప్రపంచాన్ని ఉలికిపాటుకు గురిచేసిన సంగతి తెలిసిందే.

అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఉండే అమెరికాలో ఏకంగా మాజీ అధ్యక్షుడిని హతమార్చడానికి ప్రయత్నించడం కలకలం రేపింది.

అధ్యక్ష ఎన్నికల ప్రచారంలో భాగంగా పెన్సిల్వేనియా( Pennsylvania )లోని బట్లర్ పట్టణంలో ఎన్నికల ప్రచార సభలో ట్రంప్‌ ప్రసంగిస్తుండగా ఓ యువకుడు కాల్పులకు తెగబడ్డాడు.

దీంతో బుల్లెట్ కుడి చెవి పైభాగం నుంచి దూసుకెళ్లింది. """/" / కాల్పుల శబ్ధం విని అప్రమత్తమైన ట్రంప్.

వెంటనే పోడియం కింద దాక్కొని ప్రాణాలను రక్షించుకున్నారు.రెప్పపాటులో అప్రమత్తమైన సీక్రెట్ సర్వీస్ సిబ్బంది ట్రంప్ చుట్టూ రక్షణ కవచంలా నిలబడి ఆయనను సురక్షితంగా వాహనంలోకి ఎక్కించారు.

మరోవైపు సీక్రెట్ సర్వీస్ సిబ్బందిలోని స్నైపర్ షూటర్ వేగంగా స్పందించి.దుండగుడిని మట్టుబెట్టాడు.

ఈ ఘటనలో ఓ వ్యక్తి ప్రాణాలు కోల్పోగా.మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.

"""/" / తాజాగా మిల్వాకీలో జరుగుతున్న రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌లో డొనాల్డ్ ట్రంప్ మాట్లాడుతూ.

దుండగుడిని మట్టుబెట్టిన సీక్రెట్ సర్వీస్ ఏజెంట్‌పై ప్రశంసల వర్షం కురిపించారు.ఒకే ఒక్క షాట్‌తో ఆగంతకుడిని అతడు హతమార్చాడని కొనియాడారు.

భగవంతుడి ఆశీస్సుల వల్లే మీ ముందు నిలబడగలిగానని.లేదంటే ఇవాళ ఇక్కడ ఉండేవాడిని కాదనన్నారు.

బుల్లెట్ దూసుకొస్తున్న సమయంలో.వలసదారులకు సంబంధించిన సమాచారం చూడటం కోసం చార్ట్ వైపు చూశానని , లేనిపక్షంలో బుల్లెట్ లక్ష్యాన్ని ఛేదించేదని ట్రంప్ పేర్కొన్నారు.

ఆ దాడి గురించి తలచుకోవడానికే భయంగా ఉందని.అమెరికన్ ప్రజలకు సేవ చేసే ప్రభుత్వాన్ని అందించడానికి కట్టుబడి ఉన్నానని ఆయన చెప్పారు.

నాలుగు నెలల్లో మనం అద్భుతమైన విజయాన్ని పొందబోతున్నామని ట్రంప్ ఆకాంక్షించారు.కాగా.

రిపబ్లికన్ నేషనల్ కన్వెన్షన్‌( Republican National Convention )లో పార్టీ అధ్యక్ష అభ్యర్ధిగా ట్రంప్‌ను అధికారికంగా నామినేట్ చేశారు.

దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రతినిధులు ట్రంప్ అభ్యర్ధిత్వానికి ఆమోదముద్ర వేశారు.ఇదే సమయంలో తన రన్నింగ్ మేట్ (ఉపాధ్యక్ష అభ్యర్ధి) జేడీ వాన్స్‌ను ప్రకటించారు ట్రంప్.

నాలుక మడతేసిన హరీష్ ? ఎదురుదాడి ముందే ఊహించారుగా