భారతీయులను మచ్ఛిక చేసుకునేందుకు రోజుకో ప్లాన్… మోడీపై ట్రంప్ ప్రశంసలు

నవంబర్ 3న జరగనున్న అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి భారతీయ సమాజాన్ని మచ్ఛిక చేసుకునేందుకు అక్కడి రాజకీయ పార్టీలు పడరాని పాట్లు పడుతున్నాయి.

ఇప్పటికే డెమొక్రాటిక్ అభ్యర్ధి జో బిడెన్ తన వ్యూహాలతో భారతీయులకు దగ్గరవుతున్నారు.ఈ పోటీలో తాను వెనుకబడిపోయానని భావించిన ట్రంప్ స్పీడు పెంచారు.

ఆయన తన ప్రచార వ్యూహాంలో భాగంగా భారత ప్రధాని నరేంద్రమోడీ ద్వారా ఇండో అమెరికన్లను మచ్ఛిక చేసుకోవాలని భావిస్తున్నారు.

ఈ నేపథ్యంలో మరోసారి మోడీని ట్రంప్ ఆకాశానికెత్తేశారు.వైట్ హౌస్‌లో జరిగిన న్యూస్ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఆయన భారత్ నుంచి, ఆ దేశ ప్రధాని మోడీ నుంచి తమకు మంచి మద్ధతు వుందని వ్యాఖ్యానించారు.

నరేంద్రమోడీ తనకు మంచి మిత్రుడని.ఆయన చాలా అద్భుతంగా పనిచేస్తున్నారని ట్రంప్ ప్రశంసించారు.

భారతీయులకు చాలా అద్భుతమైన, సమర్థవంతమైన నేత దొరికారని అగ్రరాజ్యాధినేత కొనియాడారు.ఇదే సమయంలో గతేడాది అమెరికాలో జరిగిన హౌడీ మోడీ కార్యక్రమాన్ని ట్రంప్ గుర్తుచేసుకున్నారు.

హ్యూస్టన్‌లో జరిగిన ఆ భారీ ఈవెంట్‌కు ప్రధాని మోడీ తనను ఆహ్వానించారని.భారత్ నుంచి మనకు గొప్ప మద్ధతుందని, అలాగే మోడీ నుంచి కూడా మనకు గొప్ప మద్ధతుందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు.

అలాగే ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన తన భారత పర్యటన విశేషాలను కూడా అమెరికా అధ్యక్షుడు ప్రస్తావించారు.

కరోనాకు ముందు జరిగిన ఆ పర్యటన చాలా అద్భుతంగా సాగిందని ట్రంప్ గుర్తుచేసుకున్నారు.

తన కుమార్తె ఇవాంకా ట్రంప్, కుమారుడు ట్రంప్ జూనియర్, ఆయన సన్నిహితురాలు కింబర్లీలకు భారతీయ సమాజంలో మంచి పేరుందన్న ఆయన.

తనకు భారతీయుల సెంటిమెంట్లు బాగా నచ్చుతాయని ట్రంప్ చెప్పారు.ఈ పరిణామాల నేపథ్యంలో భారతీయులు తనకే ఓటేస్తారని ట్రంప్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

వీడియో: పవిత్ర ప్రదేశంలో ఆ పని చేసిన యువతి.. మండిపడుతున్న జపానీయులు..