షాకిచ్చిన ట్రంప్ .. ప్రమాణ స్వీకారానికి రమ్మంటూ జిన్‌పింగ్‌కి ఆహ్వానం?

ప్రపంచంపై సైనిక, ఆర్ధిక, వాణిజ్య, రాజకీయంగా పట్టు సంపాదించి అమెరికాకు( America ) సవాల్ విసరాలని చైనా( China ) వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.

ఇప్పటికే ఈ దిశలో చాలా వరకు విజయం సాధించిన డ్రాగన్.ప్రబల ఆర్ధిక శక్తిగా ఎదుగుతోంది.

ప్రస్తుతం నెంబర్ వన్ 1గా ఉన్న అమెరికా ఆర్ధిక వ్యవస్ధను పక్కకునెట్టి ఆ ప్లేస్‌లో కూర్చోవాలని చూస్తోంది.

అయితే అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్( Donald Trump ) రాకతో పరిస్ధితులు ఒక్కసారిగా మారిపోయాయి.

తొలిసారి అధ్యక్షుడిగా ఉన్న సమయంలో చైనా దూకుడుకు ట్రంప్ కళ్లెం వేశారు.ఈసారి కూడా తన వైఖరి ఇలాగే ఉంటుందని ఆయన ముందు నుంచే సంకేతాలు ఇస్తున్నారు.

"""/" / అలాంటిది డొనాల్డ్ ట్రంప్ పెద్ద షాక్ ఇచ్చారు.వచ్చే నెల 20న జరగనున్న తన ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కావాల్సిందిగా చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను( China President Xi Jinping ) ట్రంప్ ఆహ్వానించినట్లుగా అమెరికాకు చెందిన సీబీఎస్ వార్తా సంస్ధ నివేదించింది.

ట్రంప్ ఆహ్వానాన్ని మన్నించి జిన్‌పింగ్ కనుక ఈ కార్యక్రమానికి హాజరైతే కొత్త చరిత్రకు నాంది పలికినట్లే.

అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఇప్పటి వరకు ఏ చైనా అధ్యక్షుడు పాల్గొనలేదు.

దీనికి సాధారణంగా రాయబారులే హాజరవుతారు.అయితే 1874 నుంచి నేటి వరకు ఉన్న అమెరికా విదేశాంగ శాఖ రికార్డుల ప్రకారం ఇప్పటి వరకు అమెరికా అధ్యక్షుడి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏ విదేశీ దేశాధినేత కూడా హాజరుకాలేదు.

"""/" / మరోవైపు.ట్రంప్ ఆహ్వానంపై చైనా విదేశాంగ మంత్రిత్వశాఖ ఇంకా స్పందించలేదు.

గత వారం ఎన్‌బీసీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ మాట్లాడుతూ.తాను ఇటీవల జిన్‌పింగ్‌తో మాట్లాడినట్లు తెలిపారు.

గతంలో జూన్ 2019లో జపాన్‌లో జరిగిన జీ20 సమ్మిట్( G20 Summit ) సందర్భంగా ట్రంప్ - జిన్‌పింగ్ చివరిసారిగా వ్యక్తిగతంగా కలుసుకున్నారు.

2019లో కోవిడ్ మహమ్మారి కారణంగా ప్రయాణ ఆంక్షలు చోటు చేసుకోవడం , ఇతర కారణాల నేపథ్యంలో ప్రస్తుత అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ చైనాలో పర్యటించలేదు.

అయితే ట్రంప్ బాధ్యతలు స్వీకరించాక చైనా వెళ్లే అవకాశాలు లేకపోలేదు.

అల్లు అర్జున్ ను అరెస్టు చేయడం వెనక ఎవరు ఉన్నారు…